మచ్చలపులి గాండ్రిస్తేనే.. వెన్నులో వణుకు.. ఆకలితో వేటాడటం చూస్తే గుండెలు గుబేల్.. కానీ, ఆ దంపతులను చూసి చిరుత పరార్!
పులులు జనావాసాల్లోకి వస్తేనే.. హడలెత్తి పారిపోతాం.. ఇక అరణ్యంలో చిరుతపులిని చూడాలంటేనే ధైర్యం సరిపోదు. అలాంటిది మనపై ఎటాక్ చేస్తే ఏంటి పరిస్థితి?
పులులు జనావాసాల్లోకి వస్తేనే.. హడలెత్తి పారిపోతాం.. ఇక అరణ్యంలో చిరుతపులిని చూడాలంటేనే ధైర్యం సరిపోదు. అలాంటిది మనపై ఎటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? తలుచుకుంటేనే భయంగా ఉంది కదా. కానీ ఆ దంపతులు చిరుత ఎటాక్‌ను ఎదుర్కొన్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం నాయుడు, మంజులా దేవి దంపతులు.. బైక్‌పై నారాయణవనం మండలంలోని సింగిరికోనలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం ఆలయానికి బయల్ధేరారు. ప్రశాంతమైన వాతావరణంలో సాఫీగా సాగుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా అలజడి. ఆలయానికి వెళ్లే మార్గం మధ్యలో చెట్టుపై నుంచి చిరుత పులి ఒక్కసారిగా దూకింది. దీంతో సుబ్రమణ్యం నాయుడు కాలికి గాయాలు కాగా, మంజులాదేవి తలకు దెబ్బతగిలింది. చిరుత ఎటాక్ సమయంలో వెనుక నుంచి కారు రావడంతో, చిరుతపులి భయపడి పారిపోయినట్లు బాధితులు తెలిపారు. పులి దాడిలో గాయపడిన దంపతులు ప్రస్తుతం పుత్తూరులోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
అటవీ ప్రాంతానికి సరిహద్దులోని ఇళ్లు కాలనీల్లోని కుక్కులను వెతుక్కుంటూ జనావాసాల వైపు చొచ్చుకొస్తున్నాయి. వీధి కుక్కులు, పెంపుడు కుక్కలను టార్గెట్ చేసి చిరుతలు అటవీ సరిహద్దు ప్రాంతాల వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అటవీ అధికారులు. శేషాచలం నుంచి తరచూ బయటకు వస్తున్న చిరుతలు.. తిరుమల ఘాట్ రోడ్‌లో సంచరిస్తూ భక్తులను భయపెడుతున్నాయి. తిరుపతిలోని అటవీ సరిహద్దు కాలనీలను భయపెడుతున్నాయి. జనావాసాల్లోకి చొచ్చుకొచ్చి అలజడి చేస్తున్నాయి.
ఇక, తిరుపతి శివారు ప్రాంతాల్లోకి వచ్చి దాడులు చేస్తుండడంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లపై మృగాల సంచారం కూడా పెరగడంతో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతల సంచారం పెరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ.. దట్టమైన ప్రాంతం కావడంతో.. క్రూరమృగాలు తప్పించుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అటవీ అధికారులు చిరుతల కోసం ట్రాప్ ఏర్పాటు చేయాలంటున్నారు భక్తులు. అర్జంటుగా అటవీ శాఖ అధికారులు చిరుతల కోసం ట్రాప్‌లు ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు. Read Also…