Vijayawada News: పై నుంచి దిగొచ్చిన దొంగలు.. చూస్తుండనే నాలుగు షాపుల్లో భారీ చోరీకి పాల్పడ్డారు..

Vijayawada News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పెనమలూరులో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

Vijayawada News: పై నుంచి దిగొచ్చిన దొంగలు.. చూస్తుండనే నాలుగు షాపుల్లో భారీ చోరీకి పాల్పడ్డారు..
Robbery
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 26, 2021 | 10:08 PM

Vijayawada News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పెనమలూరులో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కేవలం గంటల వ్యవధిలోనే నాలుగు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. డోర్లు ఓపెన్ చేసుకుని రావడం కష్టమని భావించారో.. ఎవరైనా గుర్తిస్తారని భావించారో గానీ.. కొత్త ప్రయత్నం చేశారు. హీరో రవితేత నటించిన ‘దొంగోడు’ సినిమా బాగా చూసినట్లుున్నారు.. అందులో రవితేజ ఎలాగైతే ఇంటి పైకప్పు నుంచి దూరి చోరీలకు పాల్పడుతాడో.. ఈ దొంగలు కూడా అచ్చంగా అలాగే దోపిడీకి పాల్పడ్డారు. దుకాణం పై భాగంలో ఉన్న రేకులను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు దొంగలు.

ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు బూట్లు ధరించిన దొంగలు.. చాలా ప్లాన్‌ ప్రకారం చోరీకి పాల్పడ్డారు. లక్ష రూపాయల నగదుతోపాటు సెల్‌ఫోన్లు, చెప్పులు, కాస్ట్‌లీ సిగరెట్ ప్యాకెట్లు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసే సమయంలో దుండగుడి విజువల్స్ సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అయితే, చోరీ జరిగినట్లు గుర్తించిన సదరు దుకాణాల యజమానులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన షాపులను పోలీసులు పరిశీలించారు. షాపుల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఐతే ఒకే వ్యక్తి నాలుగు షాపుల్లో చోరీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. పెనమలూరులో జరిగిన ఈ వరుస చోరీలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. బిజీగా ఉండే బిజినెస్‌ సెంటర్‌లో దొంగలు చోరీకి పాల్పడటం పోలీసులకు సవాల్‌గా మారింది. రాత్రిపూట పెట్రోలింగ్‌ పెంచాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.

Also read:

Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

Andhra Pradesh: విజయవాడ – బెంగళూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

Bollywood News: ఒబామాతో షాజాహాన్‌కు పోలిక.. లాజిక్ మిస్ అయ్యిందంటూ సెటైర్లు.. బాలీవుడ్‌లో మరో ట్వీట్ రచ్చ..