Bollywood News: ఒబామాతో షాజాహాన్‌కు పోలిక.. లాజిక్ మిస్ అయ్యిందంటూ సెటైర్లు.. బాలీవుడ్‌లో మరో ట్వీట్ రచ్చ..

Bollywood News: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్. నిత్యం ఏదో ఒక అంశంలో బాలీవుడ్ స్టార్స్ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.

Bollywood News: ఒబామాతో షాజాహాన్‌కు పోలిక.. లాజిక్ మిస్ అయ్యిందంటూ సెటైర్లు.. బాలీవుడ్‌లో మరో ట్వీట్ రచ్చ..
Javed Akhtar

Bollywood News: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్. నిత్యం ఏదో ఒక అంశంలో బాలీవుడ్ స్టార్స్ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ప్రముఖ సినీ పాటల రచయిత జావేద్ అక్తర్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ జావేద్ అక్తర్ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. ‘‘ఒబామా తండ్రి కెన్యా, అతని తల్లిదండ్రులు ఇప్పటికీ కెన్యాలోనే నివసిస్తున్నారు. కానీ ఒబామా మాత్రం అమెరికాలో జన్మించాడు. అలా అతనికి అమెరికా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లభించింది. భారత్‌ను పాలించిన మొఘల్ రాజవంశంలో షాజాహాన్ ఐదవ రాజు. అతని అమ్మమ్మ, అమ్మ రాజ్‌పుత్ వంశానికి చెందిన వారు. అంటే అతని శరీరంలో 75 శాతం రక్తం రాజ్‌పుత్ వంశానికి చెందినదే. కానీ షాజాహాన్‌ను మాత్రం వారు విదేశీయుడు అని పిలుస్తారు.’’ అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌ ఇప్పుడు బీటౌన్‌లోనే కాగా.. దేశ వ్యాప్తంగా రచ్చ రచ్చగా మారింది. జావేద్ అక్తర్ ట్వీట్‌పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తూ సెటైర్లు వేస్తున్నారు. ‘వలస దారుడిని.. ఆక్రమణదారుడి పోల్చడం అవివేకం’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని అణచివేసే విధానం రాచరికంతో సమానం. ప్రజాస్వామ్య బద్దంగా అమెరికా దేశాధ్యక్షుడిగా ఒబామా ఎన్నికయ్యాడు. ఆయనను ఆ దేశ ప్రజలు ఎన్నికున్నారు. కానీ షాజాహాన్‌ను ప్రజలు అతన్ని ఎన్నుకోలేదు.

అక్తర్ ట్వీట్‌పై స్పందిస్తూ, ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించాడు, “ప్రజాస్వామ్యాన్ని అణచివేత రాచరికంతో సమానం! ఒబామా తగిన ప్రజాస్వామ్య ప్రక్రియకు వచ్చినప్పుడు యుఎస్ఎ అంగీకరించారు. ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు. కాని షాజహాన్ ప్రజలు ఎన్నుకోలేదు. స్థానికులపై దురాగతాలకు పాల్పడి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ అయితే చాలా క్లారిటీ ఇస్తూ చురకలంటించారు. ‘ప్రజాస్వామ్యం చేత అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఎన్నుకోబడ్డాడు. షాజాహాన్, మొఘలులు మాత్రం దాడులు చేసి, చంపి సింహాసనాన్ని ఆక్రమించుకున్నారు. ఒబామా తన దేశ ప్రజలకు సేవ చేశారు. మొఘలలు ప్రజలను పాలించారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. హిందూ భార్యలను కలిగి ఉండటం అంటే ఈ మట్టిపై ప్రేమ ఉన్నట్లు కాదు. ఇది విభజించు.. పాలించు విధానం.’ అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలాఉంటే.. జావేద్ అక్తర్ ట్వీట్‌పై బాలీవుడ్ సినీ నిర్మాత వివేక్ అగ్నిహోత్రి కూడా స్పందించారు. అక్తర్ వ్యాఖ్య పూర్తిగా తప్పు అని ఖండించారు. ‘‘జావేద్ గారూ.. మీరు చెప్పింది పూర్తిగా తప్పు. ఒబామా తల్లిదండ్రులు, పూర్వీకులు యూఎస్‌పై దాడి చేయలేదు. భారత్‌లో మొఘలులు చేసిన మాదిరిగా.. ఒబామా ఏమీ అమెరికాలోని చర్చిలను ధ్వంసం చేయలేదు. అమెరికన్లను బలితీసుకోలేదు. ఇది పూర్తిగా అశాస్త్రీయ వాదన’’ అని కొట్టిపారేశారు.

Also read:

దంపతులపై చిరుత దాడి..ద్విచక్రవాహనం కొంత దూరం వెంబడించిన తరువాత ఎం జరిగింది..?(వీడియో):Leopard attack Video.

అదిరిపోయే సేల్.. ల్యాప్‌టాప్‌లపై రూ.35,000, స్మార్ట్‌ఫోన్‌లపై రూ.10,000 వరకు తగ్గింపు.. వివరాలివే!

Goreti Venkanna: అంబేద్కర్ తర్వాత ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే.. దళిత బంధుపై ఎమ్మె్ల్సీ గోరేటి వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు

Click on your DTH Provider to Add TV9 Telugu