AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే సేల్.. ల్యాప్‌టాప్‌లపై రూ.35,000, స్మార్ట్‌ఫోన్‌లపై రూ.10,000 వరకు తగ్గింపు.. వివరాలివే!

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలైంది. ప్రస్తుతం ఉన్న ప్రైమ్ కస్టమర్ల కోసం అమెజాన్ ప్రతీ ఏటా రెండు రోజుల పాటు ఈ ప్రైమ్-డే సేల్...

అదిరిపోయే సేల్.. ల్యాప్‌టాప్‌లపై రూ.35,000, స్మార్ట్‌ఫోన్‌లపై రూ.10,000 వరకు తగ్గింపు.. వివరాలివే!
Amazon Prime Day
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 26, 2021 | 10:40 PM

అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలైంది. ప్రస్తుతం ఉన్న ప్రైమ్ కస్టమర్ల కోసం అమెజాన్ ప్రతీ ఏటా రెండు రోజుల పాటు ఈ ప్రైమ్-డే సేల్ నిర్వహిస్తూ వస్తోంది. తద్వారా కొత్త ప్రైమ్ కస్టమర్లను కూడా ఆకర్శించుకోవచ్చునని వారి అంచనా. ఈ ప్రైమ్ డే సేల్‌లో వినియోగదారుల కోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్స్‌ను అందుబాటులో ఉంచింది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, అమెజాన్ ఎకో పరికరాలు, హోం డివైజ్స్, ఫర్నిచర్ వంటి మొదలగున వాటిపై గొప్ప ఆఫర్స్ అందిస్తోంది.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై రూ.10,000 వరకు డిస్కౌంట్, ల్యాప్‌టాప్‌లపై రూ.35 వేల వరకు డిస్కౌంట్‌ను అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా వన్‌ప్లస్, షియోమి, శామ్‌సంగ్, ఆపిల్, హెచ్‌పి, బోట్, సోనీ, అమాజ్‌ఫిట్, లెనోవా వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన వివిధ రకాల వస్తువులను డిస్కౌంట్లలో వినియోగదారులకు అందిస్తోంది. అంతేకాకుండా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాదారులకు, క్రెడిట్, డెబిట్, ఈఎంఐ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపును కూడా అమెజాన్ ఇస్తోంది. అలాగే ఈ సమయంలో మీ పాత ఫోన్‌ను మార్చుకుని కొత్తది కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు..

ప్రీమియంతో పాటు మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో ఐఫోన్ 11, ఐఫోన్ 12 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 మొదలగు స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సిఇ5జి, రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 10 ఎస్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 31లతో సహా పలు మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్స్, డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, ఖచ్చితంగా ఈ డీల్స్‌ను ఒకసారి చెక్ చేయండి.

లెనోవా టాబ్ M8, MI నోట్‌బుక్ హారిజోన్ ఎడిషన్‌తో సహా అనేక ప్రముఖ బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు రాయితీ ధరలకు లభిస్తాయి. అమెజాన్ బోట్ ఎయిర్‌డోప్స్ 441, వన్‌ప్లస్ బడ్స్ జెడ్, సోనీ డబ్ల్యూఎఫ్ -1000 ఎక్స్‌ఎమ్3లు డిస్కౌంట్లలో లభిస్తాయి. ఎయిర్‌డోప్స్ వన్‌ప్లస్ బడ్స్ జెడ్ 1999 రూపాయలకు, సోనీ డబ్ల్యూఎఫ్ -1000 ఎక్స్‌ఎం3 రూ.14,990కు లభిస్తున్నాయి. కాబట్టి లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి డీల్స్‌పై లుక్కేయండి.

Disclaimer: ఈ వార్త కేవలం సదరు వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా ప్రచురితమైనది మాత్రం. వాటితో టివీ9 ఛానల్, టీవీ9 వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని మనవి.