హాట్ షాట్స్ లో అప్ లోడ్ చేసిన క్లిప్స్ ను తొలగించాల్సిందిగా రాజ్ కుంద్రా తమను కోరేవాడని నలుగురు ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. ఈ కేసులో వీరు సాక్షులుగా మారి వాంగ్మూలమిచ్చారు. స్ట్రీమింగ్ పోర్న్ కోసం ఈ యాప్ ను కుంద్రా వినియోగించుకుంటూ వచ్చాడు. అయితే డిలీట్ చేసిన ఈ క్లిప్స్ ఆ తరువాత ఏమయ్యేవో తమకు తెలియదని ఈ ఉద్యోగులు చెప్పారు. యాండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ ఫోన్లలో యాప్ స్టోర్ నుంచి హాట్ షాట్ యాప్ ను తొలగించిన తరువాత నిందితుడు (రాజ్ కుంద్రా) ప్లాన్ ‘బి’ ని అమలు చేశాడని, ‘బాలీ ఫేమ్’ అనే మరో యాప్ ని లాంచ్ చేశాడని పోలీసులు తెలిపారు. కాగా-ఈ కేసులో ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన ఓ అధికారికి. యాష్ ఠాకూర్ అనే ఓ నిందితుడికి మధ్య లింకు ఉన్నట్టు వారు కనుగొన్నారు. (యాష్ పరారీలో ఉన్నాడు). ఆ అధికారి తన భార్య పేరిట యాప్ ను రిజిస్టర్ చేయించాడని, అవార్డు పొందిన లఘు చిత్రాలను మాత్రమే ఇందులో అప్ లోడ్ చేయాలని కోరినప్పటికీ..యాష్ కావాలని పోర్న్ క్లిప్స్ ను అప్ లోడ్ చేసేవాడని కూడా తెలిసింది.
అయితే ఈ విధమైన వీడియోలు కేవలం శృంగారపరమైనవి తప్పితే బూతు మూవీలు కావని కుంద్రా..పోలీసులకు చెప్పినట్టు తెలియవచ్చింది. ఇలా ఉండగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే స్లోగా వెళ్తోందని మహారాష్ట్రలో బీజేపీ నేత ఆశిష్ షెలార్ ఆరోపించారు. దీనిపై మల్టీ మినిస్టీరియల్ టాస్క్ ఫోర్స్ ను నియమించాలని కోరుతూ ఆయన హోమ్ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : దంపతులపై చిరుత దాడి..ద్విచక్రవాహనం కొంత దూరం వెంబడించిన తరువాత ఎం జరిగింది..?(వీడియో):Leopard attack Video.
తెలంగాణలో ఎలక్షన్ టాక్ సైడ్ అయిందా?దళిత బంద్ పధకం కాదు ఒక ఉద్యమం..:Big News Big Debate Live Video.