Sherlyn Chopra: రాజ్‌కుంద్రా కేసులో కొత్త ట్విస్ట్‌.. హీరోయిన్ షెర్లిన్ చోప్రాకు సమన్లు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 26, 2021 | 6:55 PM

Sherlyn Chopra - Raj Kundra Case : బాలీవుడ్‌లో పోర్నోగ్రఫీ వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పోర్నోగ్రఫీ వ్యవహారంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను

Sherlyn Chopra: రాజ్‌కుంద్రా కేసులో కొత్త ట్విస్ట్‌.. హీరోయిన్ షెర్లిన్ చోప్రాకు సమన్లు..
Sherlyn Chopra And Raj Kundra

Follow us on

Sherlyn Chopra – Raj Kundra Case : బాలీవుడ్‌లో పోర్నోగ్రఫీ వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పోర్నోగ్రఫీ వ్యవహారంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి.. ఎవరెవరు పాత్రదారులు అన్న వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. దీనిలో భాగంగా సైబర్‌ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. రాజ్‌ కుంద్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. అనంతరం ఈ పోర్నోగ్రఫీలో భాగస్వామ్యమైన వారిని విచారించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు పోర్నోగ్రఫి వ్యవహారంలో ముందు నుంచి పేరు వినిపిస్తున్న షెర్లిన్ చోప్రాకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు.

ఈ కేసుకు సంబంధించి షెర్లిన్‌ చోప్రా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు కార్యాలయానికి హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ సెల్ నోటిసులు ఇచ్చినట్లు ముంబై పోలీసులు సోమవారం సాయంత్రం వెల్లడించారు. కాగా షెర్లిన్‌ చోప్రా విచారణ అనంతరం పలువురికి సమన్లు జారీ చేసే అవకాశముందని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలాఉంటే.. ఈ పోర్నోగ్రఫి వ్యవహారంపై షెర్లిన్ చోప్రా ఇటీవల సోషల్‌ మీడియా వేదిక ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా కేసులో మొదట పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది తానేనని ఆమె వీడియో ద్వారా వెల్లడించింది. తనపై రకరకాల ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఎక్కడకి పారిపోలేదంటూ తెలిపింది.

Also Read:

Crime: కన్నతండ్రి పాడు బుద్ది.. స్నేహితుడితో కలిసి కూతురు, కొడుకుతో అసభ్యంగా ప్రవర్తించి.. చివరకు..

Illegal Affair: కొడలితో మామ అక్రమ సంబంధం.. కొడుకుకు తెలియడంతో.. ఆ తండ్రి ఏం చేశాడంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu