Tweet War: ట్విట్టర్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొట్లాట.. అసలు మేటర్ ఏంటంటే?

Umakanth Rao

Umakanth Rao | Edited By: Janardhan Veluru

Updated on: Jul 26, 2021 | 7:40 PM

అస్సాం-మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో హఠాత్తుగా ఉద్రిక్తత తలెత్తింది. హోమ్ మంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై ఇలా ఢిల్లీ వెళ్లారో లేదో ఈ రెండు రాష్ట్రాలు కలహించుకోవడం విశేషం. అస్సాం కచార్ జిల్లా సరిహద్దు పొడవునా జరిగిన అల్లర్లలో అస్సాం పోలీసులు...

Tweet War: ట్విట్టర్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొట్లాట.. అసలు మేటర్ ఏంటంటే?
Fresh Violence At The Borders Assam And Mizoram Borders

Follow us on

అస్సాం-మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో హఠాత్తుగా ఉద్రిక్తత తలెత్తింది. హోమ్ మంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై ఇలా ఢిల్లీ వెళ్లారో లేదో ఈ రెండు రాష్ట్రాలు కలహించుకోవడం విశేషం. అస్సాం కచార్ జిల్లా సరిహద్దు పొడవునా జరిగిన అల్లర్లలో అస్సాం పోలీసులు, జవాన్లు గాయపడ్డారు. అటు అస్సాం జవాన్ల దాడుల్లో గాయపడిన తమ ప్రజల తాలూకు వీడియోను మిజోరం సీఎం జొరాంతాంగ తన ట్వీట్స్ లో షేర్ చేశారు. అమిత్ షా వెంటనే జోక్యం చేసుకుని ఈ హింసకు స్వస్తి చెప్పేలా చూడాలన్నారు. కచార్ నుంచి వెళ్తున్న ఓ జంటపై థగ్గులు, గూండాలు దాడి చేశారని, ఇలాంటి చర్యలను ఎలా సమర్థిస్తామని ఆయన ప్రశ్నించారు. అస్సాం పోలీసులు తమ రాష్ట్ర ప్రజలపై లాఠీచార్జి చేసి బాష్ప వాయువు ప్రయోగించారన్నారు. అటు అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ.. మిజోరాం పోలీసులు మా సిబ్బందిని వారి పోస్టుల నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని, ఈ విధమైన పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతామని ఆయన కూడా ట్వీట్ చేశారు.

ఇటీవల కచార్ జిల్లాలో మిజోరాంకు చెందిన కొంతమంది అస్సాం అధికారులపై గ్రెనేడ్ విసిరారు. అప్పటి నుంచే మెళ్ళగా రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య 164.6 కి.మీ. బోర్డర్ ఉంది. నిజానికి ఈ సరిహద్దుల్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటూ వచ్చేది. అయితే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య రేగిన ఉద్రిక్తత చివరకు పోలీసులు, జవాన్ల వరకు, ప్రభుత్వాల వరకు వెళ్ళింది. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాంతి భద్రతలను కాపాడాలని, సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలని అమిత్ షా నిన్న జరిగిన సమావేశంలో సూచించారు. కానీ నేడు అందుకు పూర్తి విరుద్జంగా జరిగింది.

మరిన్ని ఇక్కడ చూడండి : దంపతులపై చిరుత దాడి..ద్విచక్రవాహనం కొంత దూరం వెంబడించిన తరువాత ఎం జరిగింది..?(వీడియో):Leopard attack Video.

 తెలంగాణలో ఎలక్షన్ టాక్‌ సైడ్‌ అయిందా?దళిత బంద్ పధకం కాదు ఒక ఉద్యమం..:Big News Big Debate Live Video.

 బొమ్మ అదుర్స్.. సూర్య లాంటి భర్త కావాలంటున్న అంజలి అలియాస్ మౌనిక రెడ్డి..:Mounika Reddy Interview Video.

 అరుదైన ఘటన..!మనిషి ప్రాణం తీసిన నెమలి..అరుదైన కారణంతో మృత్యు ఒడికి చేసిన యువకుడు..:Man dies With peacock video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu