త్రిపురలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ ‘హౌస్ అరెస్ట్’..హోటల్ లో గంటల పాటు నిర్బంధం

ఎన్నికలవ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ లోని 22 మంది సభ్యులను త్రిపురలో పోలీసులు 'గృహ నిర్బంధం' లో ఉంచారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి అవసరమైన గ్రౌండ్ వర్క్ సేకరించేందుకు

త్రిపురలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ 'హౌస్ అరెస్ట్'..హోటల్ లో గంటల పాటు నిర్బంధం
Election Strategist Prashant Kishor
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jul 26, 2021 | 8:27 PM

ఎన్నికలవ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ లోని 22 మంది సభ్యులను త్రిపురలో పోలీసులు ‘గృహ నిర్బంధం’ లో ఉంచారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి అవసరమైన గ్రౌండ్ వర్క్ సేకరించేందుకు వీరు సోమవారం ఈ రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే వీరు బస చేసిన హోటల్ నుంచి వీరిని బయటకు వచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈ రాహ్త్రంలో 2023 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో టీఎంసి బలోపేతానికి గల అవకాశాలను అధ్యయనం చేయడానికి వీరంతా వెళ్లారు. కానీ వీరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, బయటివారని అంటూ పోలీసులు వారిని ఇక్కడి నుంచి కదలనివ్వలేదు. పైగా కోవిడ్ నిబంధనలు అతిక్రమించారని కూడా వారు ఆరోపించారు.

కానీ ఈ సభ్యుల వద్ద కోవిడ్ కి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని తెలిసింది. తమ రొటీన్ చెకప్ లో ఇది భాగమని పోలీసులు చెబుతున్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. త్రిపుర పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తూ.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం.. మా బెంగాల్ లో బీజేపీ ఓటమిని చూసి భయపడుతోందని ట్వీట్ చేశారు. అందువల్లే వీరిని హౌస్ అరెస్ట్ చేశారన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఇది బీజేపీ అపసవ్య పాలనకు అద్దం పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ శాఖ చీఫ్ ఆశిష్ లాల్ సింఘాల్ కూడా తమ రాష్ట్ర పోలీసుల తీరును ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి : దంపతులపై చిరుత దాడి..ద్విచక్రవాహనం కొంత దూరం వెంబడించిన తరువాత ఎం జరిగింది..?(వీడియో):Leopard attack Video.

 తెలంగాణలో ఎలక్షన్ టాక్‌ సైడ్‌ అయిందా?దళిత బంద్ పధకం కాదు ఒక ఉద్యమం..:Big News Big Debate Live Video.

 బొమ్మ అదుర్స్.. సూర్య లాంటి భర్త కావాలంటున్న అంజలి అలియాస్ మౌనిక రెడ్డి..:Mounika Reddy Interview Video.

 అరుదైన ఘటన..!మనిషి ప్రాణం తీసిన నెమలి..అరుదైన కారణంతో మృత్యు ఒడికి చేసిన యువకుడు..:Man dies With peacock video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu