Crime: దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి వృద్ధురాలిపై అత్యాచారం.. ఆపై కారం చల్లి క్రూరంగా..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 26, 2021 | 6:10 PM

Old woman raped: 65 ఏళ్ల వృద్ధురాలిపై ఓ 45 ఏళ్ల వ్యక్తి కక్షతో దారుణానికి ఒడిగట్టాడు. ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పినా ఆమె.. వెళ్లకపోవడంతో

Crime: దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి వృద్ధురాలిపై అత్యాచారం.. ఆపై కారం చల్లి క్రూరంగా..
Woman raped

Old woman raped: 65 ఏళ్ల వృద్ధురాలిపై ఓ 45 ఏళ్ల వ్యక్తి కక్షతో దారుణానికి ఒడిగట్టాడు. ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పినా ఆమె.. వెళ్లకపోవడంతో అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు అని చూడకుండా.. కాళ్లు, చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం కారం పొడి చల్లి క్రూరంగా ప్రవర్తించాడు. చివరకు కట్లు విప్పకుండానే వెళ్లిపోయాడు. దీంతో ఆమె అచేతనంగా పొలంలో పడి ఉండటాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు.. పోలీసులకు సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా కబ్రాయ్‌ పట్టణంలో చోటుచేసుకుంది.

65 ఏళ్ల వృద్ధురాలిని భరత్‌ కుశ్వహ అనే వ్యక్తి కక్షతో శనివారం అర్ధరాత్రి బలవంతంగా ఇంటి నుంచి పొలాల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. మరొకరితో కలిసి అతిదారుణంగా గాయపర్చారని తెలిపారు. బాధితురాలి సమాచారం మేరకు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లాలని వృద్దురాలిని కొన్ని రోజులుగా కుశ్వహ ఒత్తిడి చేస్తున్నాడని.. ఆమె వినకపోవడంతో ఇలా చేశారని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

Illegal Affair: కొడలితో మామ అక్రమ సంబంధం.. కొడుకుకు తెలియడంతో.. ఆ తండ్రి ఏం చేశాడంటే..

Crime: కన్నతండ్రి పాడు బుద్ది.. స్నేహితుడితో కలిసి కూతురు, కొడుకుతో అసభ్యంగా ప్రవర్తించి.. చివరకు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu