Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఫలితంగా రోజూ వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల..
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఫలితంగా రోజూ వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా 500 నుంచి 700 మధ్య పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,14,105 సాంపిల్స్ సేకరించి టెస్ట్‌లు నిర్వహించగా.. 638 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన ఒక్క రోజులో 715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మహమ్మారి ప్రభావంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కాగా, తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,41,791 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 6,28,679 మంది కోలుకున్నారు. కాగా, వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 3,787 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 97.95 శాతం రికవరీ రేటు ఉండగా.. 0.59 శాతం మరణాల రేటు ఉంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా వరంగల్ అర్బన్ పరిధిలో 69 నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఇప్పుడు జిల్లాల్లో అత్యధికంగా నమోదు అవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 59 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. కరీంనగర్ 65, ఖమ్మం 62 చొప్పున అధిక కేసులు నమోదు అయ్యాయి.
ఇక జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 4, బద్రాద్రి కొత్తగూడెం 33, జగిత్యాల 28, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 5, జోగులాంబ గద్వాల 1, కామారెడ్డి 2, కొమరంభీం ఆసిఫాబాద్ 2, మహబూబ్‌నగ్ 9, మహబూబాబాద్ 17, మంచిర్యాల 24, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 32, ములుగు 5, నాగర్ కర్నూల్ 4, నల్లగొండ 37, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 3, పెద్దపల్లి 45, రాజన్న సిరిసిల్ల 25, రంగారెడ్డి 19, సంగారెడ్డి 7, సిద్దిపేట 10, సూర్యాపేట 22, వికారాబాద్ 2, వనపర్తి 3, వరంగల్ రూరల్ 16, యాదాద్రి భువనగిరి 20 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
Also read:
యజమానికి శునకం సాయం…విశ్వాసానికి చిరునామా గా మరోసారి రుజువు..వైరల్ అవుతున్న వీడియో..:Dog Video.