Covid-19: వాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం.. అమెరికాలో విజృంభిస్తున్న కరోనా.. భారత్‌ను దాటిన కేసులు..

US overtakes India in Covid-19 cases: ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. రోజువారి కేసుల్లో

Covid-19: వాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం.. అమెరికాలో విజృంభిస్తున్న కరోనా.. భారత్‌ను దాటిన కేసులు..
US Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 26, 2021 | 9:10 PM

US overtakes India in Covid-19 cases: ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. రోజువారి కేసుల్లో అమెరికా మళ్లీ భారతదేశాన్ని అధిగమించింది. తాజాగా యూఎస్‌లో కేసుల సంఖ్య 52 వేలు దాటింది. అయితే.. రెండు వారాల్లోనే అమెరికాలో 170శాతం కేసులు పెరిగాయాని ఇది తీవ్రమైన హెచ్చరిక లాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. కేసులు పెరగడానికి కూడా ప్రజల నిర్లక్ష్యమేనని పేర్కొంటున్నారు. అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ.. చాలామంది వ్యాక్సిన్‌ను తీసుకోవడం లేదని.. దీనివల్లనే కేసుల సంఖ్య అమాంతం పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది ప్రజల నిర్లక్ష్యమేనని.. వ్యాక్సిన్‌ తీసుకోకుండా కోవిడ్‌ మహమ్మారిని నియంత్రించడం చాలా కష్టమని హెచ్చరించారు. సెకండ్‌ వేవ్‌ అనంతరం కేసులు పెరుగుతున్నాయని.. ఇది థర్డ్‌ వేవ్‌ సంకేతమని.. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే నియంత్రించడం కష్టమని అమెరికన్‌ వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అయితే చాలా మందిలో వ్యాక్సిన్‌ వల్ల అనర్థాలు వస్తాయన్న ఆలోచనలు ఉన్నాయని.. దీనికి ఇటీవల జరుగుతున్న సంఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు.

వారం క్రితం.. ఒక ప్రముఖ రేడియో హోస్ట్ టీకా తీసుకోబోనంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. వ్యాక్సిన్‌ తీసుకుంటే.. వైరస్‌ సోకినా.. చనిపోయే అవకాశాలు తక్కువని పలు అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. కానీ అతను అలా పేర్కొని.. వ్యాక్సిన్‌ తీసుకోలేదని వైద్యులు తెలిపారు. ఇప్పుడు అదే వ్యక్తి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతున్నాడని నిపుణులు హెచ్చరించారు. ఇలా ఇంకో వ్యక్తి కూడా వ్యాక్సిన్‌ గురించి పలు వ్యాఖ్యలు చేసి కరోనాతో పోరాడుతున్నాడని వివరించారు. అయితే.. కరోనా కట్టడికి, మరణాల నియంత్రణకు వ్యాక్సిన్‌ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నప్పటికీ.. అలసత్వం వహించడం ప్రమాదమని అమెరికా వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారు ఇప్పటికైనా వ్యాక్సిన్‌ తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు.

Also Read:

తాలిబన్ల పోరుతో భారత పర్యటనను వాయిదా వేసుకున్న ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ అహ్మద్ జాయ్..

Jeff Bezos: జెఫ్‌ బెజోస్‌‌‌‌‌ను కిడ్నాప్ చేసిన ఏలియన్లు.. క్లారిటీ ఇచ్చిన అమెజాన్‌ సంస్థ

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే