Healthy Breakfast: ఉదయాన్నే పెరుగు, అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలు.. బరువు తగ్గించే సూపర్ ఫుడ్..
అరటి పండు ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని ఐరన్ లోపాన్ని మెరుగుపరిచింది.. శక్తిని ఇస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అరటి పండును తినని వారుండరు.
అరటి పండు ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని ఐరన్ లోపాన్ని మెరుగుపరిచింది.. శక్తిని ఇస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అరటి పండును తినని వారుండరు. ఇక పెరుగు కూడా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందులో ఉన్న బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. అలాగే కడుపు సమస్యలను తగ్గిస్తుంది. అరటితోపాటు పాలు తాగడం చాలా మందికి అలవాటు. దీనివలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలుంటాయి. కానీ ఉదయం అరటి పండుతోపాటు.. పెరుగు కూడా తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో మంచి బ్యాక్టీరియా, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అరటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా.. శరీరానికి ఉల్లసాన్ని అందిస్తాయి. ఉదయం అల్పాహారంలో అరటి, పెరుగు తీసుకోవడం వలన ప్రయోజనాలు అధికంగానే ఉన్నాయి.
ఎముకలు బలంగా.. అరటిలో ఉండే ఫైబర్ పెరుగులో ఉండే బ్యాక్టీరియా రెండు శరీరానికి మేలు చేసేవి. ఇవి కాల్షియం గ్రహించడానికి సహయపడతాయి. అల్పాహారంలో పెరుగు, అరటి పండు తీసుకోవడం వలన ఎముకలు బలంగా ఉంటాయి.
బరువును అదుపులో ఉంచుతుంది… పెరుగులో, అరటి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పెరుగులో కలిపి అరటి పండు తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వు బర్న్ చేస్తుంది. అల్పాహారంలో పెరుగుతోపాటు, అరటి తీసుకోవడం ద్వారా ఎక్కువగా ఆకలి వేయడు. ఫలితంగా క్రమంగా బరువు అదుపులో ఉంటుంది.
మలబద్దకం సమస్య.. మలబద్దకం సమస్యలతో బాధపడుతున్నవారు రోజు ఉదయాన్నే పెరుగు, అరటి పండు తీసుకోవడం మంచిది. అలాగే ఈ సమస్యను తగ్గించుకోవడానికి అరటి, ఎండుద్రాక్షలను పెరుగులో కలిపి తీసుకోవడం మంచిది.
AP Weather Report : బంగాళఖాతంలో మరో అల్పపీడనం.. రానున్న 3 రోజులపాటు ఏపీలో ఓ మోస్తారు వర్షాలు..!