Ayurveda Curd: పెరుగు తినడం ఇష్టం లేదా.. మీరు ఎన్ని ఆరోగ్య ప్రయోజలు మిస్ అవుతున్నారో తెలుసా..!
Ayurveda Curd: మరిగించిన పాలలో గోరువెచ్చగా ఉండగా మజ్జిగ చుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. ఇది ఒక మంచి ఆహారపదార్ధం.. పెరుగు నుండి వెన్న,..
Ayurveda Curd: మరిగించిన పాలలో గోరువెచ్చగా ఉండగా మజ్జిగ చుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. ఇది ఒక మంచి ఆహారపదార్ధం.. పెరుగు నుండి వెన్న, నెయ్యి, మీగడ లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాత వ్యాధినైనా నయం చేస్తుంది. శరీరానికి పుష్టిని కలిగగించే ఈ పెరుగు ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి మంచిదని ఆయుర్వేదంలో చెబుతుంది. ముఖ్యంగా జలుబుగా ఉన్నపుడు పెరుగు మంచి ఔషధం లా పనిచేస్తుంది. అలాగే మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమం. ముఖ్యంగా మీగడ తీసిన పెరుగు, పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగు అత్యుత్తమమైన ఫలితాలనిస్తాయి. అలాగే ఆయుర్వేదం పెరుగును గురించి చెబుతూ రాత్రి వేళల్లో పెరుగు వేసుకోకూడదని చెబుతుంది.. ఇక పెరుగుని వేడి చేసి తినకూడదు. ఇటువంటి పెరుగుని ఇష్టపడే వాళ్ళు ఎంత మంది ఉన్నారో పెరుగు నచ్చదని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. అయితే పెరుగుని జీలకర్ర, మిరియాలు వంటి ఇతర ఆహారపదార్ధాలతో కలిపి తింటే అద్భుత ఫలితాలను ఇస్తుంది.. పెరుగు ఇతర పదార్ధాలతో కలిసి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
*పెరుగు నార్మల్ గా తింటే బరువు పెరుగుతారు.. అదే జీలకర్ర పొడిని పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. *జీర్ణ సంబంధ సమస్యలు , గ్యాస్, అసిడిటీ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు.. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేసుకుని దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే.. గ్యాస్ , అసిడిటీ తో విముక్తి పొందుతారు. * నీరసం, బలహీనంగా అనిపించినవారు కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది.మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. *నోటి పూత, దంత సమస్యలు, పంటి నొప్పి ఉన్నవారు.. పెరుగులో కొంత వాము కలిపి తీసుకుంటే వెంటనే దంత సమస్యలు తగ్గుతాయి. * ఓ కప్పు పెరుగులో కొంచెం నల్ల మిరియాల పొడిని కలిపి తింటే.. తిన్న ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. *పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తింటే.. శరీరానికి మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. కండరాల పుష్టికి దోహదం చేస్తాయి. *పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడుతుంది. *పెరుగులో పసుపు, అల్లం కలిపి తింటే.. ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. * పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. * పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు నివారింపబడతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. అంతేకాదు శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది.
Also Read: Abdul Kalam: ఆదర్శ మూర్తి.. మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం వర్ధంతి నేడు.. ఘన నివాళులర్పిస్తున్న యావత్ భారత దేశం