Abdul Kalam: ఆదర్శ మూర్తి.. మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం వర్ధంతి నేడు.. ఘన నివాళులర్పిస్తున్న యావత్ భారత దేశం
Abdul Kalam:ఆదర్శానికి నిలువెత్తు రూపం.. యువతలో విజయకాంక్షలను రగిలించిన మిస్సైల్ మ్యాన్ భారత దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణించి నేటితో..
Abdul Kalam:ఆదర్శానికి నిలువెత్తు రూపం.. యువతలో విజయకాంక్షలను రగిలించిన మిస్సైల్ మ్యాన్ భారత దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణించి నేటితో 6 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఎందరో యువతకు స్ఫూర్తిని నింపి కలలంటే నీకు నిద్రలో వచ్చేవి కావు. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవి అని స్ఫూర్తి ని నింపిన అబ్దుల్ కలాం వర్ధంతి నేడు.అబ్దుల్ కలాం..వర్ధంతి సందర్భంగా ఆ మహాత్మునికి యావత్ భారత దేశం ఘన నివాళులర్పిస్తుంది. ఒక శాస్త్రవేత్తగా భారత దేశంలో అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి. కలాం దేశ యువతకు ఆదర్శప్రాయులు. గొప్ప మహనీయుని అబ్దుల్ కాలం చేసిన సేవలను గురించి మరోసారి యావత్ భారతం గుర్తు చేసుకుంటుంది.
కలలను సాకారం చేసుకోమంటూ విద్యార్ధి లోకాన్ని తట్టిలేపిన మహనీయులు అబ్దుల్ కలాం. ఆచరణ ద్వారా కలలను సాకారం చేసుకుని చూపించిన ఆదర్శమూర్తి. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, అధ్యాపకుడిగా రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం అందించిన సేవలు సామాన్యమైనవి కావు. “‘చిన్న లక్ష్యం కలిగి ఉండటమనేదే పెద్ద నేరంతో సమానమని” అబ్దుల్ కలాం ఎపుడూ చెబుతుండేవారు. మనం పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటికోసం పోరాడాలని చెబుతుండేవారు. ఏపీజే అబ్దుల్ కలాం 1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జైనులాబ్దిన్, ఆసియామ్మ దంపతులకు జన్మించారు. కలాం కుటుంబం పేదరికంలో ఉండడంతో చిన్న తనం నుండే తన అవసరాలకు పేపర్ బాయ్ గా పని చేశారు.
1960 సంవత్సరంలో” ది మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ” నుంచి అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరి ఆ తరువాత ఇస్రోలో కూడా ఆయన తన సేవలు అందించారు. 1963 సంవత్సరం తర్వాత పలు దేశాల్లో పర్యటించారు. బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్‌లలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే భారత అణు పరీక్ష కేంద్రంలో కీలకంగా పనిచేసారు. అరవైవ దశకంలో చైనా, పాకిస్థాన్ లతో భారత్ యుద్ధం చేయాల్సి వస్తూ ఉండేది ఆ సమయంలో భారత రక్షణ రంగం మరింత పటిష్టంగా ఉండాలని కలాం గుర్తించారు. ఇందుకోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆ సమయం లో కలాం ఇస్రోలో సేవలు అందిస్తూ ఉండేవారు. ఆ సమయంలో పిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి-3 వంటి ప్రాజెక్టులను రూపొందించడంలో కలాం ఎంతగానో కృషి చేసారు. 1970 దశకంలో బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయాలనే సంకల్పాన్ని అబ్దుల్ కలాం వెల్లడించారు. ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్‌లకు రూపకల్పన చేసి ఆ ప్రోజెక్టుల విషయం లో అబ్దుల్ కలాం విశేషమైన సేవలందించారు. 1997వ సంవత్సరంలో ఆయనను భారతరత్న వరించింది. ఇక భారత దేశానికి 2002 నుండి 2007 సంవత్సరం వరకు 11వ రాష్ట్రపతిగా కలాం విశేష సేవలు అందించారు..భారత్ రక్షణ రంగం బ్రహ్మౌస్ వంటి సూపర్ సానిక్ మిస్సైల్‌ను తయారు చేయగలిగిందంటే దానికి కారణం అబ్దుల్ కలాం వేసిన గట్టి పునాదులే.
దాదాపు 40 కి పైగా విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ను ప్రదానం చేసాయి. ప్రముఖ రచయిత అరుణ్ తివారి సాయంతో ఆయన తన ఆత్మకథ పుస్తకాన్ని ”వింగ్స్ ఆఫ్ ఫైర్” పేరుతో విడుదల చేసారు. అలాంటి గొప్ప మహానుభావుడు 83 ఏళ్ళ వయసులో 2015వ సంవత్సరం జులై 27వ తేదీన షిల్లాంగ్ లోని ఐఐఎంలో ప్రసంగిస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దేశానికి అబ్దుల్ కలాం సేవలు మరవలేనివి. యువత ప్రతి ఒక్కరు కూడా ఆ మహానువాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నేడు అబ్దుల్ కలాం 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇవే ఘన నివాళులు.
Also Read: Actor Sai Kumar: సీనియర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వ్యాఖ్యాత సాయికుమార్ పుట్టిన రోజు నేడు..