Papaya: నోరూరించే బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు.. ఉపయోగాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Subhash Goud

Subhash Goud | Edited By: Anil kumar poka

Updated on: Jul 27, 2021 | 10:42 AM

Papaya: నిగనిగలాడుతూ చూడగానే నోరూరించే బొప్పాయి పండులో పోషకాలు పుష్కలంగానే ఉంటాయి. అన్ని రకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో..

Papaya: నోరూరించే బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు.. ఉపయోగాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!
Papaya

Papaya: నిగనిగలాడుతూ చూడగానే నోరూరించే బొప్పాయి పండులో పోషకాలు పుష్కలంగానే ఉంటాయి. అన్ని రకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రెబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది. ఈ పండు తింటే గర్భస్రావం అవుతుందని, గర్భిణులు తినకపోవడమే మేలని పెద్దలు చెపుతుంటారు.

పుట్టు పూర్వోత్తరాలు

బొప్పాయి సుమారు 400 సంవత్సరాల క్రితం విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. రంగు, రుచి, వాసనలో మేలైన ఈ పండు కాలక్రమంలో దేశమంతా విస్తరించి ప్రజల మన్ననను పొందింది.

రోగ నిరోధక శక్తి

వంద గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. డెంగ్యూవ్యాధిని నివారిస్తుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

ఉపయోగాలు

* బొప్పాయి మలబద్ధకాన్ని పోగొడుతుంది. * ఆహారాన్ని వెంటనే అరిగేలా చేస్తుంది. * టీబీని నివారిస్తుంది. * రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. * రక్తంలోని దోషాలను నివారిస్తుంది. * రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది. * వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. * కడుపులోని యాసిడ్స్‌ను కంట్రోల్ చేస్తుంది.

జీర్ణక్రీయ వేగవంతం…

బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి కాయ ముక్కలను వేస్తారు.

బ్రేక్ ఫాస్ట్‌గా బొప్పాయి…

* బొప్పాయి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా మంచిది. * బొప్పాయిపండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. * బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయ సంబంధ జబ్బులు నయం చేస్తుంది.

నీళ్ల విరేచనాలకు

నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుకోసం బొప్పాయి గింజలు రెండు భాగాలు, ఒక భాగం శొంఠి, కొద్దిగా ఉప్పు కలిపి చూర్ణంగా చేయాలి. ఈ చూర్ణాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేగాకుండా పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది.

బొప్పాయి పాలతో ఎంతో మేలు

10 గ్రాముల బొప్పాయి పాలను చెరకు రసంతో కలిపి తీసుకుంటే పచ్చకామెర్లు నయమవుతాయని చెబుతుంటారు. బొప్పాయి పాలలో కొంచెం తేనె కలిపి ఇస్తే కడుపులో నులి పురుగులు పడిపోతాయి. చిన్నపిల్లలకు అరస్పూను ఇస్తే సరిపోతుంది. తేనె కలిపిన పాలకు రెట్టింపుగా వేడి నీరు కలిపి చల్లారిన తర్వాత మాత్రమే తాగించాలి.

బొప్పాయి ఆకులతో వైద్యం

బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి తాగించాలి. దీనివల్ల హైఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఈ నీటికి గుండెనొప్పిని కూడా తగ్గించే గుణం ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బొప్పాయి వాడుతుండాలి. మధుమేహం కూడా నయమవుతుంది.

బీపీ తగ్గిస్తుంది

రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి. బాలింతలకు : బొప్పాయి ముక్కలను పాలతో కలిపి బ్రేక్‌ఫాస్టుగా తీసుకుంటే బాలింతలకు స్తన్యం ఎక్కువగా వస్తుంది.

ఔషధంగా…

* అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ల విరేచనాలను వెంటనే అరికడుతుంది. * వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భుజించడం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తాగటం, మానసిక ఒత్తిడి, మితిమీరిన టెన్షన్ వంటివి జీర్ణకోశాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు అమోఘంగా పనిచేస్తుంది. * బొప్పాయి కాయలను కూరగా వండుకుని రెండు వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి. * బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. * ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది.

సౌందర్య సాధనంగా

* బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది. * బ్యూటీక్రీమ్‌లు, బ్యూటీ లోషన్లలో పండును ఎక్కువగా వాడతారు. * బొప్పాయి చెట్టు పాలు చర్మ సంరక్షణకు లోషన్‌గా ఉపయోగపడుతాయి. * బొప్పాయి కాయలను బాగా ఎండబెట్టి, పొడిగా మార్చి, ఉప్పు కలుపుకుని తింటే చర్మం అందంగా తయారవుతుంది. * బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్‌లా నెల రోజులు చేసుకుంటే నల్లదనం తగ్గి రంగు తేలుతుంది. * బొప్పాయి పండు, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మేలు చేస్తుంది.

ఇవీ కూడా చదవండి

Pulse Oximeter: గుడ్‌న్యూస్‌.. పల్స్‌ ఆక్సీమీటర్‌తో పాటు ఐదు రకాల మెడికల్‌ పరికరాల ధరలు భారీగా తగ్గింపు

Hair Care Tips: మీకు బాగా జట్టు రాలుతుందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu