Pulse Oximeter: గుడ్‌న్యూస్‌.. పల్స్‌ ఆక్సీమీటర్‌తో పాటు ఐదు రకాల మెడికల్‌ పరికరాల ధరలు భారీగా తగ్గింపు

Pulse Oximeter: దేశంలో థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు ఊరట కలిగించేలా ఉంది. కోవిడ్ -19 చికిత్స, నివారణలో..

Pulse Oximeter: గుడ్‌న్యూస్‌.. పల్స్‌ ఆక్సీమీటర్‌తో పాటు ఐదు రకాల మెడికల్‌ పరికరాల ధరలు భారీగా తగ్గింపు
Pulse Oximeter
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2021 | 7:52 AM

Pulse Oximeter: దేశంలో థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు ఊరట కలిగించేలా ఉంది. కోవిడ్ -19 చికిత్స, నివారణలో ఎక్కువగా ఉపయోగించిన పల్స్ ఆక్సిమీటర్, డిజిటల్ థర్మామీటర్ వంటి ఐదు వైద్య పరికరాలపై ప్రభుత్వం వాణిజ్య మార్జిన్లను పరిమితం చేయడంతో వాటి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ధరలు ఏకంగా 88 శాతం వరకు దిగి వచ్చాయి. కరోనా మొదటి వేవ్ లో కేసులు విపరీతంగా పెరిగినా మరణాల సంఖ్య ఎక్కువగా నమోదు కాలేదు. అయితే మొదటి వేవ్ తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభించింది. దీంతో ఈ సారి కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకు అంత పెరిగాయి. అయితే మరణించిన కరోనా రోగుల్లో శ్వాస సరిగ్గా ఆడకపోవడంతో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని గణంగాకాలు చెబుతున్నాయి. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది, ప్రజలు.. మెడికల్‌ పరికరాలను కొనుగోలు చేశారు. అంటే పల్స్ ను చెక్ చేసుకోవడానికి పల్స్‌ ఆక్సీమీటర్, నెబ్యులైజర్‌ వంటి వాటిని కొనుగోలు చేశారు.

ధరలు పెంచిన మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్లు:

ఇలా ముందస్తుగా వీటి కొనుగోలు చేయడంతో మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు వాటి ధరలను అమాంతం పెంచేశారు. ఇలా కొవిడ్‌ బాధితుల శ్వాస, షుగర్‌ శాతం, రక్తపోటు, జ్వరం పరీక్షించేందుకు ఉపయోగించే పల్స్‌ ఆక్సీమీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్, డిజిటల్‌ థర్మామీటర్‌తో పాటు శ్వాస సంబంధ ససస్యలు పరిష్కరించేందుకు వినియోగించే నెబ్యులైజర్‌ ధరలు కూడా గణనీయంగా పెంచి విక్రయించారు. అయితే వీటిని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే ట్రేడ్‌ మార్జిన్‌ను గరిష్ఠంగా 70 శాతానికి పరిమితం చేశారు. దీంతో నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈనెల 20 నుంచి ఈ వైద్య పరికరాల ధరలు దిగొచ్చినట్లు వెల్లడించింది.

ఐదు రకాల వైద్య పరికరాల తగ్గింపు

కరోనా బాధితుల చికిత్సలో కీలకంగా మారిన పల్స్‌ ఆక్సీమీటర్, నెబ్యులైజర్‌ వంటి 5 రకాల వైద్య పరికరాల ధరలు 88 శాతం వరకు తగ్గాయని రసాయనాలు, ఎరువుల శాఖ తెలిపింది. 2021, జూలై 23 నాటికి 684 బ్రాండ్ల వైద్య పరికరాలు నమోదు కాగా.. 620 (91 శాతం) పరికరాల ఎమ్మార్పీ ధరలను ఆయా సంస్థలు సవరించాయి. కాగా, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగానే తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,13,71,901 ఉండగా, మరణాలు 4,20,551కి చేరాయి.

ఇవీ కూడా చదవండి

Health Tips : ఆల్కహాల్‌తో ఈ 5 ఆహార పదార్థాలు అస్సలు తినవద్దు..! చాలా డేంజర్..

Beauty Tips : కళ్ల కింద ముడతలా..! ఈ 4 సహజ పద్దతులు చక్కటి పరిష్కారం..

అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..