Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాల వైపే భారతీయులు.. తాజాగా నిర్వహించిన సర్వేలో స్పష్టం

Electric Vehicles: ప్రపంచ వ్యాప్తంగా వచ్చే 12 నెలల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) విక్రయాలు ఊపందుకోనున్నాయి. మ‌న‌దేశంతో స‌హా వివిధ దేశాల్లోని వాహ‌నాల వినియోగ‌దారుల్లో 90 శాతం..

Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాల వైపే భారతీయులు.. తాజాగా నిర్వహించిన సర్వేలో స్పష్టం
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2021 | 8:16 AM

Electric Vehicles: ప్రపంచ వ్యాప్తంగా వచ్చే 12 నెలల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) విక్రయాలు ఊపందుకోనున్నాయి. మ‌న‌దేశంతో స‌హా వివిధ దేశాల్లోని వాహ‌నాల వినియోగ‌దారుల్లో 90 శాతం మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నం కొనుగోలు చేయ‌డానికి ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎర్నెస్ట్ అండ్ యంగెస్ట్ (ఈవై) అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అయితే ఈవై సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది.. ఎల‌క్ట్రిక్ వాహ‌న ధ‌ర‌లో 20 శాతం ప్రీమియం చెల్లించేందుకు సిద్ధం అని సంకేతాలిచ్చారు. ఇండియాలో ఒక‌సారి చార్జింగ్ చేసిన ఎల‌క్ట్రిక్‌ వాహ‌నం 100-200 మైళ్ల దూరం ప్రయాణించే సామ‌ర్థ్యం క‌లిగి ఉండాల‌ని కోరారు. సుమారు 90 శాతం మంది ఇండియ‌న్లు ఎల‌క్ట్రిక్ వెహికిల్ కొనుగోలు చేయ‌డానికి ప్రీమియం చెల్లించ‌డానికి సిద్ధం అని పేర్కొన్నారు. వారిలో 40 శాతం మంది స‌ద‌రు ప్రీమియం 20 శాతం వ‌ర‌కైనా చెల్లించేందుకు రెడీ అని సంకేతాలిచ్చారు.

కాగా, ఇప్పుడు అందుబాటులో ఉన్న మోడ‌ల్ కార్ల కంటే డిజిట‌ల్ చానెల్స్ ఉన్న కార్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా 97 శాతం మందిలో ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల అవ‌గాహ‌న పెరిగింది.

ఈవీల‌తోనే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ:

67 శాతం మంది ఒక విద్యుత్ వాహ‌నాన్ని కొనుగోలు చేసి త‌మ వంతుగా వ్యక్తిగ‌తంగా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌కు ముందుకు వ‌స్తున్నారు. 69 శాతం మంది ఈ ల‌క్ష్య సాధ‌న‌కు ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ కొనుగోలు చేయ‌డం ఒక్కటే మార్గం అని సర్వేలో స్పష్టం అయ్యింది.

చార్జింగ్ సామ‌ర్థ్యంపై ఇలా..

ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహ‌నం క‌లిగి ఉన్న వారు.. కొత్తగా మార్కెట్‌లోకి వ‌చ్చే వాహ‌నాలు గంట‌లోపే పూర్తిగా చార్జింగ్ చేసే సామ‌ర్థ్యం క‌లిగి ఉండాల‌ని అభిప్రాయ ప‌డుతున్నారు. 45 శాతం మంది కొత్తగా ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ కొనుగోలు చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Hero Maestro Edge 125: గుడ్‌న్యూస్‌.. సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్.. బ్లూటూత్.. మరిన్ని ఆప్షన్స్

Personal Loan Limit: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచుతూ ప్రకటన.. కానీ వారికి మాత్రమే..!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే