AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో భారీ తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్లు..!

Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరో సేల్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఈ సేల్ జూలై 29 వరకు అందుబాటు..

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో భారీ తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్లు..!
Flipkart Big Saving Days Sale
Subhash Goud
| Edited By: Phani CH|

Updated on: Jul 26, 2021 | 8:27 AM

Share

Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో  వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్ జూలై 29 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై గొప్ప తగ్గింపును ఇస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12 మినీ 64 జిబి రూ. ఈ వారం సేల్‌లో కేవలం రూ. 57,999  మాత్రమే విక్రయిస్తున్నారు. దీని ఎమ్మార్పీ ధర రూ .69,900 ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 12 మినీతో బండిల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ , డెబిట్ కార్డ్ వినియోగదారులు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

ప్రస్తుతం రూ.23,999 ధర గల పోకో ఎక్స్3 ప్లస్ సేల్ సమయంలో రూ.17,249 కే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో లభ్యం అవుతుంది. పోకో ఎక్స్3 ప్లస్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ ప్లేతో వస్తుంది. ఈ మొబైల్‌ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రియర్ క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది.

ఇక ఆపిల్ , ఐఫోన్ 12 64 జిబి రూ. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో 67,999 లభిస్తోంది. దీని అసలు ధర రూ. 79,900 ఉంది. అలాగే మోటరోలా రజర్ (6 జీబీ, 128 జీబీ) దీని ఎమ్మార్పీ ధర రూ. 1,49,999 ఉంది. ప్రస్తుతం 54,999 రూపాయల తగ్గింపు ధరలకు విక్రయిస్తోంది. లక్షకు పైగా ఉన్న ఈ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేశారు. కాగా, మోటో రేజర్ 5 జి ధర 89,999 రూపాయలు. పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకొని అదనపు తగ్గింపు రూ .19,250 గరిష్టంగా పొందవచ్చు.

రియల్‌మీ 8 (4 జీబీ, 128 జీబీ) ప్రస్తుతం రూ .13,999 లభిస్తుంది. దీని ఎమ్మార్పీ ధర రూ .16,999) ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇవే కాకుండా ఈ సేల్‌లో భాగంగా మరెన్నో మొబైళ్లపై, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ తగ్గింపుతో అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌.

ఇవీ కూడా చదవండి

Hyundai: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కార్లపై హ్యుందాయ్‌ కీలక నిర్ణయం..ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గింపు

Digital India Sale: భారీ ఆఫర్లతో డిజిటల్ ఇండియా సేల్‌ను ప్రకటించిన రిలయన్స్‌ డిజిటల్.. భారీ డిస్కౌంట్లు