AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyundai: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కార్లపై హ్యుందాయ్‌ కీలక నిర్ణయం..ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గింపు

Hyundai: ప్రస్తుతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా ఇళ్లతో పాటు చాలా వరకు వాహనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల సంస్థ.

Hyundai: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కార్లపై హ్యుందాయ్‌ కీలక నిర్ణయం..ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గింపు
Hyundai
Subhash Goud
|

Updated on: Jul 24, 2021 | 11:31 AM

Share

Hyundai: ప్రస్తుతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా ఇళ్లతో పాటు చాలా వరకు వాహనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల సంస్థ హ్యుందాయ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కార్లపై ఆఫర్‌ ప్రకటించింది. ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించడంతో పాటు స్పెషల్‌ సర్వీసులను అందిస్తున్నట్లు హ్యుందాయ్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారీగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ముంబైలో వర్షాల కారణంగా దెబ్బతిన్న హ్యుందయ్‌ సంస్థకు చెందిన వాహనాలకు ఈ ఏడాది పాటు స్పెషల్‌ సర్వీస్‌లు అందించడంతో పాటు ఇన్సూరెన్స్‌ ప్రీమియంలో 50 శాతం తగ్గిస్తున్నట్లు హ్యుందాయ్ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ డైరక్టర్‌ తరుణ్‌ గార్గ్‌ ప్రకటించారు.

అయితే గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై నగరం అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఆచూకీ లభించలేదని మహరాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు. రంగంలోకి దిగిన నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు, భారత నౌకాదళం కూడా సహాయక చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా 84,452 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలైన రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టకొని బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Hero Maestro Edge 125: గుడ్‌న్యూస్‌.. సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్.. బ్లూటూత్.. మరిన్ని ఆప్షన్స్

Mercedes Benz: మెర్సెడెజ్‌ బెంజ్‌ కీలక నిర్ణయం.. అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్‌ వాహనాలు