Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Maestro Edge 125: గుడ్‌న్యూస్‌.. సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్.. బ్లూటూత్.. మరిన్ని ఆప్షన్స్

Hero Maestro Edge 125: వినియోగదారుల కోసం వాహన కంపెనీలు సరికొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో ద్విచక్ర వాహనాలను..

Hero Maestro Edge 125: గుడ్‌న్యూస్‌.. సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్.. బ్లూటూత్.. మరిన్ని ఆప్షన్స్
Hero Maestro Edge 125
Follow us
Subhash Goud

|

Updated on: Jul 24, 2021 | 7:13 AM

Hero Maestro Edge 125: వినియోగదారుల కోసం వాహన కంపెనీలు సరికొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ సంస్థ హీరో తన సరికొత్త మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.72,250 (ఎక్స్ షోరూం) నిర్ణయించింది హీరో సంస్థ. ఈ స్కూటర్‌ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఈ హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ కు బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. బుకింగ్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో ప్రారంభమయ్యాయి. హీరో ఇండియా అధికారిక వెబ్ సైట్లో దీన్ని సొంతం చేసుకోవచ్చు.

వేరియంట్ల వారీగా ధరలు..

ఈ హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 మూడు వేరియంట్లోల దొరుకుతుంది. డ్రమ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.72,250లు కాగా.. డిస్క్ వేరియంట్ ధర రూ.76,500లుగా నిర్ణయించారు. కనెక్టెడ్ వేరియంట్ వచ్చేసి రూ. రూ.79,750లుగా నిర్ణయించింది. అంతేకాకుండా ఈ స్కూటర్ ప్రిస్మాటిక్ యెల్లో, ప్రిస్మాటిక్ పర్పుల్ రంగుల్లో సొంతం లభిస్తుంది. డిస్క్ వేరియంట్ అయితే క్యాండీ బ్లేజింగ్ రెడ్, ఫ్యాంథర్ బ్లాక్, పెరల్ సిల్వర్ వైట్, మ్యాట్ టెక్నో బ్లూ, ప్రిస్మాటిక్ యేల్లో, ప్రిస్మాటిక్ పర్పుల్ రంగుల్లో లభ్యమవుతుంది. డ్రమ్ వేరియంటైతే క్యాండీ బ్లేజింగ్ రెడ్, ప్యాంథర్ బ్లాక్, పెరల్ సిల్వర్ వైట్, మ్యాట్ టెక్నో బ్లూ రంగుల్లో సొంతం చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌ ఫ్రంట్ ఎండ్ డిజైన్‌తోపాటు సరికొత్త డ్యూయల్ ప్రాజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు ఉన్నాయి. ఇవి కాకుండా ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్లు, షార్పర్ ఫ్రంట్ డిజైన్, స్పోర్టీ డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్, మాస్కెడ్ వింకర్లు లాంటి అప్‌డేట్‌ చేశారు. అంతేకాకుండా మంచి ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. టర్న్ బై టర్న్ నేవిగేషన్, మిస్డ్ కాల్ అండ్ ఇంకమింగ్ కాల్ అలర్ట్‌, రియల్ టైం మైలేజ్ ఇండికేషన్(ఆర్టీఎంఐ), ఎకో ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా లైవ్ వెహికల్ ట్రాకింగ్, డ్రైవింగ్ స్కోర్, జియో ఫెన్సింగ్ అలర్ట్‌, హీరో లోకేట్ స్పీడ్  అలర్ట్‌, టాపుల్ అలర్ట్‌, టూ వే అలెర్ట్, వెహికల్ స్టార్ట్ అలర్ట్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

​ఇంజిన్ విషయానికొస్తే..

ఈ హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ 124.6సీసీ పీజీఎం-ఫై ఇంజిన్ ను కలిగి ఉంది. అలాగే ఎక్స్ సెన్స్ టెక్నాలజీతో పాటు వచ్చింది. అంతేకాకుండా ఇది 7000 ఆర్పీఎం వద్ద 9 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద 10.4 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సస్పెన్షన్, బ్రేక్స్, వీల్స్ తో పాటు టైర్లు అదే ఓల్డ్ మోడల్ తో పాటు వచ్చింది. 125సీసీ స్కూటర్లలో బ్లూటూత్ ఆప్షన్ తో వచ్చిన మొదటి బైక్ మ్యాస్ట్రో ఎడ్జ్ గుర్తింపు తెచ్చుకుంది.

ఇవీ కూడా చదవండి

Yamaha FZ25: యమహా ఎఫ్‌జెడ్ 25 మోటో జీపీ ఎడిషన్ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!

Mercedes Benz: మెర్సెడెజ్‌ బెంజ్‌ కీలక నిర్ణయం.. అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్‌ వాహనాలు