AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan Limit: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచుతూ ప్రకటన.. కానీ వారికి మాత్రమే..!

Personal Loan Limit: బ్యాంకుల రుణాల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అప్పుడప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఎవరైనా బ్యాంకు నుంచి..

Personal Loan Limit: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచుతూ ప్రకటన.. కానీ వారికి మాత్రమే..!
Subhash Goud
|

Updated on: Jul 24, 2021 | 11:04 AM

Share

Personal Loan Limit: బ్యాంకుల రుణాల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అప్పుడప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఎవరైనా బ్యాంకు నుంచి పర్సనల్‌ లోన్‌ మంజూరు కావాలంటే అందుకు లిమిట్‌ ఉంటుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే అన్ని పత్రాలు సరి చూసి, సదరు వ్యక్తికి రుణం ఇచ్చేందుకు అర్హతలున్నాయా..? లేదా అనే విషయాలను గమనించి బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తుంటుంది. ఇక తాజాగా వ్యక్తిగత రుణాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. పర్సనల్‌ లోన్స్‌ లిమిట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ నిర్ణయంతో వ్యక్తిగత రుణాల పరిమితిని భారీగా పెంచినట్లయింది.

అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం కేవలం కొందరికి మాత్రమే వర్తిస్తుంది. ఎవరెవరికి అంటే.. బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, బ్యాంక్ చైర్మన్, వీరి కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ లిమిట్ పెంపు వర్తిస్తుంది. అంటే వీరందరూ బ్యాంకుల నుంచి ఇకపై ఎక్కువ డబ్బులు పర్సనల్ లోన్ కింద తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. ఇంతకు ముందు వీరికి రూ.25 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం ఉండేది. ఇక తాజాగా ఆర్బీఐ నిర్ణయంతో వీళ్లు రూ.5 కోట్ల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. అంటే ఆర్‌బీఐ లోన్ లిమిట్‌ను 25 పెంచినన్నట్లు. మేనేజ్‌మెంట్ కమిటీ ఆమోదం తర్వాతనే లోన్ తీసుకోవాలని షరతు విధించింది.

ఇవీ కూడా చదవండి:

Postal Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ఏడాదికి రూ.59,400.. ఎలాగంటే..!

RBI Good News: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై సెలవు రోజుల్లోనూ.!