Postal Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ఏడాదికి రూ.59,400.. ఎలాగంటే..!

Postal Scheme: వినియోగదారులకు కొత్త కొత్త స్కీమ్‌లో బ్యాంకుల్లోనే కాదు.. పోస్టాఫీసుల్లోనే ఉన్నాయి. ఆదాయం పెంచుకునేందుకు రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది పోస్టల్‌ శాఖ..

Postal Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ఏడాదికి రూ.59,400.. ఎలాగంటే..!
Follow us

|

Updated on: Jul 24, 2021 | 9:42 AM

Postal Scheme: వినియోగదారులకు కొత్త కొత్త స్కీమ్‌లో బ్యాంకుల్లోనే కాదు.. పోస్టాఫీసుల్లోనే ఉన్నాయి. ఆదాయం పెంచుకునేందుకు రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది పోస్టల్‌ శాఖ. అయితే చేతిలో డబ్బులు ఉండి ఎందులోనైనా ఇన్వెస్ట్‌ చేయాలని భావించే వారికి అవకాశం. అలాంటి వారికి పోస్టల్‌ శాఖలో ఓ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. అదే మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా డబ్బులు పొందవచ్చు. పోస్టాఫీస్‌ స్కీమ్స్‌లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. రూ.1000తో కూడా పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్‌ ద్వారా నెలకు రూ.5 వేలు పొందే అవకాశం ఉంటుంది. అయితే సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ తీసే వెసులుబాటు అందుబాటులో ఉంది.

సింగిల్‌ అకౌంట్‌, జాయింట్‌ అకౌంట్‌ అయితే..

కాగా, పోస్టల్‌ శాఖలో డబ్బులు అన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకుంటే సింగిల్ అకౌంట్ అయితే రూ.4.5 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మీకు ఏడాదికి రూ.29,700 లభిస్తుండగా, అదే రూ.9 లక్షలు పెడితే రూ.59,400 వస్తాయి. ఈ లెక్కన చూస్తే నెలకు దాదాపు రూ.5 వేల వరకు వస్తాయి. ఈ పోస్టల్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండదు. ఒకవేళ డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. చార్జీలు పడతాయి. డిపాజిట్ అమౌంట్‌లో 2 శాతం తీసుకుంటారు. 3 సంవత్సరాలలోపు తీసుకోవాలని అనుకుంటే ఈ చార్జీలు వర్తిస్తాయి. తర్వాత అయితే 1 శాతం చార్జీ పడే అవకాశం ఉంటుంది. ఇలా పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో రకరకాల స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా మరెన్నో స్కీమ్‌లు ఉన్నాయి. డబ్బులను పెట్టుబడిగా పెడితే నెల,సంవత్సరం ఇలా ఎక్కువ మొత్తంలో రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి పథకాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్కో స్కీమ్‌కు ఒక్క విధంగా నిబంధనలు ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తేనే కాకుండా తక్కువ మొత్తంలో కూడా డబ్బులు పెడితే మంచి రాబడి వచ్చే స్కీమ్‌లు ఉన్నాయి. ఒకప్పుడు పోస్టు లేటర్లు, ఇతర వాటికి మాత్రమే పోస్టల్‌ శాఖ ఉండగా, సామాన్యులు కూడా మంచి రాబడి పొందే విధంగా స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం.

ఇవీ కూడా చదవండి

Viral Video: అమాంతంగా భారీ గుడ్డును మింగేసిన పాము.. సోషల్‌ మీడియాలో షాకింగ్‌ వీడియో వైరల్‌..!

Hero Maestro Edge 125: గుడ్‌న్యూస్‌.. సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్.. బ్లూటూత్.. మరిన్ని ఆప్షన్స్