Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమాంతంగా భారీ గుడ్డును మింగేసిన పాము.. సోషల్‌ మీడియాలో షాకింగ్‌ వీడియో వైరల్‌..!

Viral Video: సాధారణంగా పాములంటే అందరికి భయమే. పెద్దల నుంచి చిన్నారుల వరకు పాములంటే వణికిపోతుంటారు. కానీ అన్ని పాములు కూడా విషపూరితమైనవి కావు...

Viral Video: అమాంతంగా భారీ గుడ్డును మింగేసిన పాము.. సోషల్‌ మీడియాలో షాకింగ్‌ వీడియో వైరల్‌..!
Viral Video
Follow us
Subhash Goud

|

Updated on: Jul 24, 2021 | 9:27 AM

Viral Video: సాధారణంగా పాములంటే అందరికి భయమే. పెద్దల నుంచి చిన్నారుల వరకు పాములంటే వణికిపోతుంటారు. కానీ అన్ని పాములు కూడా విషపూరితమైనవి కావు. అయినప్పటికీ పాములకు దూరంగానే ఉంటారు. సాధారణంగా పాములు తన ఆకలిని తీర్చుకునేందుకు రకరకాల కీటకాలు, చిన్న చిన్న పక్షులను సైతం తింటుంటాయి. ఇలాంటి వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. కొన్ని పాములు తన సామర్థ్యం కంటే ఎక్కువ రేట్లలో ఆహారం తింటుంటాయి.

అయితే పాములు గుడ్లను కూడా తింటుంటాయి. పెద్ద సైజులో ఉండే గుడ్లను పాము నిజంగానే తింటుందా..? అంత పెద్ద సైజు ఉన్న గుడ్డు ఎలా తింటుందనే అనుమానాలు రావచ్చు. ఆకలితో ఉన్న పాములు పెద్ద పెద్ద గుడ్లను సైతం తినేస్తుంటాయి. అలాంటి వీడియోలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అడవిలో ఆకలితో ఉన్న ఓ పాము ముందుగా అటు ఇటు తచ్చాడుతూ.. కొద్దిసేపటి తర్వాత ఓ భారీ గుడ్డును తినేందుకు రెడీ అయిపోయింది. ఆ భారీ గుడ్డును అమాంతంగా మింగేసింది. ఈ షాకింగ్ వీడియో లైఫ్ అండ్ నేచర్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో ఇప్పటికే వేల మంది చూసేశారు. ఈ వీడినయోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే చిన్న చిన్న పాములు తన ఆకలిని తీర్చుకునేందుకు ఎంతకైనా సాహసం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం.

ఇవీ కూడా చదవండి

గుడిసె పై మందు బాబు డ్యాన్స్‌.. ఇదేం పైశాచికత్వం అంటున్న నెటిజన్లు..ట్రోల్ అవుతున్న వీడియో..:Dance on The hut‌ video

Hero Maestro Edge 125: గుడ్‌న్యూస్‌.. సరికొత్త హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్.. బ్లూటూత్.. మరిన్ని ఆప్షన్స్