- Telugu News Photo Gallery Business photos Reliance digital announced digital india sale with exclusive deals and amazing offers sale august 5th
Digital India Sale: భారీ ఆఫర్లతో డిజిటల్ ఇండియా సేల్‌ను ప్రకటించిన రిలయన్స్ డిజిటల్.. భారీ డిస్కౌంట్లు
Digital India Sale: అతిపెద్ద ఎలక్ట్రానిక్ సేల్ రిలయన్స్ డిజిటల్ ఇండియా ఆకర్షణీయమైన ఆఫర్లకు ముందుకు రాబోతోంది.ఈ సేల్ అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్..
Updated on: Jul 24, 2021 | 1:21 PM

Digital India Sale: అతిపెద్ద ఎలక్ట్రానిక్ సేల్ రిలయన్స్ డిజిటల్ ఇండియా ఆకర్షణీయమైన ఆఫర్లకు ముందుకు రాబోతోంది.ఈ సేల్ అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, www.reliancedigital.in లలో కూడాలో ఆఫర్ లభించనుంది. డిజిటల్ ఇండియా సేల్' సేల్‌లో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌పై ఎక్స్‌క్లూజీవ్ డీల్స్, ఆఫర్స్ ప్రకటించింది రిలయెన్స్ డిజిటల్.

ఈ ఆఫర్లు ఆగస్టు 5 వరకు ఉంటుంది. అలాగే కొనుగోలు చేసిన వస్తువులపై ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. టెలివిజన్స్, గృహోపకరణాలు, మొబైల్స్, ల్యాప్‌టాప్, ఇతర వస్తువులపై ఆఫర్లు అందుబాటులో ఉంచారు. క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ లావాదేవీలకూ ఇది వర్తిస్తుంది. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ లావాదేవీలకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.

రిలయెన్స్ డిజిటల్ 'డిజిటల్ ఇండియా సేల్'లో అనేక ప్రొడక్ట్స్‌పై అనేక ఆఫర్లు ఉన్నాయి. టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, మొబల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, యాక్సెసరీస్ లాంటి ప్రొడక్ట్స్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.

32 అంగుళాల స్మార్ట్ టీవీలు రూ.12,990 ధరలలో లభ్యమవుతున్నాయి. అలాగే రిప్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్, మొబైల్స్, ఇతర ఎలక్ట్రినిక్ పరికరాలపై అనేక ఆఫర్లు ఉన్నాయి. కేవలం 3 గంటల్లోపే ప్రొడక్ట్స్ డెలివరీ అవుతాయి. దగ్గర్లోని స్టోర్‌లో పికప్ ఆప్షన్ కూడా ఉంటుంది.




