Hair Care Tips: మీకు బాగా జట్టు రాలుతుందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..

Monsoon Hair Care Tips: ఆధునిక ప్రపంచంలో సర్వసాధారణంగా అందరూ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య జుట్టు రాలడం. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా..

Hair Care Tips: మీకు బాగా జట్టు రాలుతుందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..
Hair Care Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 26, 2021 | 10:04 PM

Monsoon Hair Care Tips: ఆధునిక ప్రపంచంలో సర్వసాధారణంగా అందరూ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య జుట్టు రాలడం. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే వర్షాకాలంలో జుట్టు రాలడం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. రుతుపవనాల సీజన్‌లో గాలిలో అధిక తేమ ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. దీంతో జట్టు బాగా రాలిపోతుంది. అయితే.. హేయిర్‌ ఫాలింగ్‌ను నియంత్రించేందుకు చాలామంది కెమికల్ షాంపులు, రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. అలాంటివి కాకుండా ఇంట్లో ఉన్న కొబ్బరినూనె, పలు రకాల పదార్థాల మిశ్రమంతో జట్టు రాలడాన్ని సులభంగా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉల్లిపాయ రసం – కొబ్బరి నూనె.. ఉల్లిపాయ రసం – కొబ్బరి నూనె మిశ్రమంతో జట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. దీనికోసం ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాలి. దానిని ఒక గిన్నెలో వేసి దాని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి మంచిగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి. 30-40 నిమిషాల తర్వాత షాంపూతో స్నానం చేస్తే జట్టు రాలడం తగ్గుతుంది. ఇలా వర్షాకాలంలో పదిరోజులకొకసారి చేస్తే మంచిదని పేర్కొంటున్నారు.

ఉసిరి – ఆలివ్ ఆయిల్ రెండు స్పూన్ల ఉసిరి పొడిలో 1 స్పూన్‌ ఆలివ్ ఆయిల్‌ను కలిపాలి. ఆ మిశ్రమాన్ని జట్టుకు పట్టించాలి. అనంతరం కొంతసేపటి వరకు మసాజ్‌.. చేసి 30-40 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె – కర్పూరం ముందుగా.. ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేడి చేయాలి. అనంతరం దానిలో రెండు ముక్కల కర్పూరం వేయాలి. ఆ కర్పూరం పూర్తిగా కరిగిపోయే వరకు అలాగే ఉంచాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చల్లార్చిన తరువాత జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల పాటు ఉంచి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు పేస్ట్ కొన్ని తాజా కరివేపాకు రెమ్మలు తీసుకొని వాటిలో కొంచెం నీరు వేసి పేస్ట్ చేయాలి. అనంతరం ఆ పేస్ట్‌ను బాగా జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. 40-45 నిమిషాలు ఉంచిన తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ చిట్కాలను వర్షాకాలంలో వారానికి 2-3 సార్లు పాటిస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది.

Also Read:

Covid-19: వాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం.. అమెరికాలో విజృంభిస్తున్న కరోనా.. భారత్‌ను దాటిన కేసులు..

Health Tips: గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? వెంటనే ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం మానేయండి!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!