AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Cancer: చర్మ సంబంధ కేన్సర్‌ను యాంటీ బయాటిక్స్ సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.. తాజా పరిశోధనల్లో వెల్లడి 

చర్మ సంబంధిత కేన్సర్ (మెలనోమా) తో పోరాడటానికి కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Skin Cancer: చర్మ సంబంధ కేన్సర్‌ను యాంటీ బయాటిక్స్ సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.. తాజా పరిశోధనల్లో వెల్లడి 
Skin Cancer
KVD Varma
|

Updated on: Jul 27, 2021 | 10:53 AM

Share

Skin Cancer: చర్మ సంబంధిత కేన్సర్ (మెలనోమా) తో పోరాడటానికి కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధన చేసిన బెల్జియం శాస్త్రవేత్తలు, ఈ యాంటీబయాటిక్స్ క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని అవి పెరగకుండా ఆపుతాయని తేల్చారు. ఈ యాంటీబయాటిక్స్ ప్రభావం ఎలుకలపై ప్రయోగాలలో కనిపించింది. జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ మెడిసిన్స్‌లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం, ఈ యాంటీబయాటిక్స్ చర్మ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆయుధంగా నిలబడే అవకాశం ఉంది.

యాంటీబయాటిక్స్ క్యాన్సర్ కణాలను నియంత్రించగలవు

పరిశోధకుడు ఎలినోరా లియుసి వెల్లడించిన ప్రకారం.. చర్మ క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ, కొన్ని క్యాన్సర్ కణాలు చికిత్స సమయంలో మందుల ప్రభావాల నుండి తమను తాము రక్షించుకుంటాయి. ఈ కణాలు భవిష్యత్తులో కొత్త కణితులను ఏర్పరుస్తాయి. యాంటీబయాటిక్స్ సహాయంతో వాటిని నియంత్రించవచ్చని పరిశోధనలో తేలింది. ఇటువంటి యాంటీబయాటిక్‌లను యాంటీ మెలనోమా ఏజెంట్లుగా ఉపయోగించవచ్చు.

ఎలుకలపై ప్రయోగం

క్యాన్సర్ కణాలపై యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని చూడటానికి ఒక ప్రయోగం జరిగింది. క్యాన్సర్ కణితిని రోగి నుండి తొలగించి ఎలుకలో అమర్చారు. దీనికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించారు. పరిశోధకుడు లియుసీ ప్రకారం, యాంటీబయాటిక్స్ చాలా క్యాన్సర్ కణాలను త్వరగా చంపింది.

పరిశోధన సమయంలో, కొన్నిఔషధాల ప్రభావం బ్యాక్టీరియాపై కూడా సమర్ధంగా పనిచేస్తాయని నిరూపితం అయింది. అయితే, క్యాన్సర్ కణాలు ఈ ఔషధాలకు సున్నితంగా ఉన్నట్లు తేలింది. అందువల్ల, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పాటు, వాటిని క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు.

చర్మ సంబంధ కేన్సర్ వ్యాధి ఎలా వస్తుంది అనేదానిపై ఇప్పటికీ ఒక స్పష్టత లేదు. సాధారణంగా సూర్యరశ్మి కారణంగా ఇది వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి ఇప్పటివరకూ రకరకాల పద్ధతుల్లో చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిశోధనలతో చర్మ సంబంధ కేన్సర్ ను యాంటీబయాటిక్స్ తో సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Also Read: Monsoon Foods: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదట.. లేకపోతే వ్యాధులు వచ్చే అవకాశం..!

Corona infected Moms: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి.. తన బిడ్డకు పాలు ఇవ్వవచ్చా? పరిశోధనలు ఏమంటున్నాయి?