AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Foods: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదట.. లేకపోతే వ్యాధులు వచ్చే అవకాశం..!

Monsoon Foods: వర్షాకాలంలో వచ్చిందంటే చాలు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. లేదంటే వ్యాధుల బారిన పడి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు..

Monsoon Foods: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదట.. లేకపోతే వ్యాధులు వచ్చే అవకాశం..!
Monsoon Foods
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 27, 2021 | 10:29 AM

Share

Monsoon Foods: వర్షాకాలంలో వచ్చిందంటే చాలు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. లేదంటే వ్యాధుల బారిన పడి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు బాగా కురిసే సమయంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు. లేదంటే దానిలోని బ్యాక్టీరియా కారణంగా అనే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపుతాయి. అందుకే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వైద్య నిపుణులు తెలిపిన ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

పుల్లటి ఆహారాలు:

పులుపుగా ఉండే మిఠాయి, చింతపండుతో చేసిన ఆహారాలు పక్కన పెట్టేస్తే మంచిదంటున్నారు నిపుణులు. పుల్లని ఆహారాలు శరీరంలోని నీటిని నిలుపుకోవడానికి కారణమవుతాయి. దాని వల్ల శరీరం ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. పుల్లటి ఆహారాలు జ్వరానికి కూడా కారణంగా ఉంటాయి.

జ్యూస్:

ఇంట్లో తయారు చేసే జ్యూస్‌లు కాకుండా బయట రోడ్ల పక్కన అమ్మే జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. సాధారణంగా రోడ్డు పక్కన ఉండే పండ్ల రసాలను చాలా మంది సేవిస్తుంటారు. ఎందుకంటే జ్యూస్‌ స్టాల్స్‌ వారు పండ్లను ముందే కోసి పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది. అలాంటి జ్యూస్ మీరు తాగితే రోగాల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి జ్యూస్ తాగాలనుకుంటే అప్పుడే కోసిన పండ్లతో ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది.

సముద్ర ఆహారం

వర్షాకాలంలో చేపలను పెంచుతారు. అలాంటి సమయాల్లో సముద్ర ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. అలాగే రోడ్ల పక్కన ఉండే చాట్‌భండార్‌, సమోసా లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో ఈగలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిపై వాలి మనకు ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది.

ఆకు కూరలు

ఆకు కూరలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. నిజానికి వీటిని ఏ కాలంలోనైనా తినవచ్చు. కానీ వర్షాకాలంలో కొన్ని రోజుల పాటు తినకుండా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆకు కూరల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్యాబేజీ వంటి వాటిల్లో తేమ కారణంగా సూక్ష్మ క్రిములు నిలిచి ఉంటాయి. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. కాలానుగుణంగా సరైన కూరగాయలను ఎంచుకోవడం మంచిది.

ఇవీ కూడా చదవండి

Fresh Fish: మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!

Healthy Breakfast: ఉదయాన్నే పెరుగు, అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలు.. బరువు తగ్గించే సూపర్ ఫుడ్..