AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Side Effects: చాయ్ ప్రియులకు చేదు వార్త.. ఎక్కువగా టీ తాగితే గొంతు క్యాన్సర్.. ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్న అధ్యయనాలు….

పని వలన కలిగిన ఒత్తిడిని.. అలసటను తగ్గించి కాస్త ఉత్సాహాంగా ఉండేందుకు చాలా మంది టీ తాగేందుకు ఇష్టపడుతుంటారు. రోజులో ఎక్కువసార్లు చాయ్ తాగేస్తుంటారు.

Tea Side Effects: చాయ్ ప్రియులకు చేదు వార్త.. ఎక్కువగా టీ తాగితే గొంతు క్యాన్సర్.. ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్న అధ్యయనాలు....
Tea Side Effects
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2021 | 3:39 PM

Share

పని వలన కలిగిన ఒత్తిడిని.. అలసటను తగ్గించి కాస్త ఉత్సాహాంగా ఉండేందుకు చాలా మంది టీ తాగేందుకు ఇష్టపడుతుంటారు. రోజులో ఎక్కువసార్లు చాయ్ తాగేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కేవలం అలసటను తగ్గించి ఉత్సాహంగా ఉంచడమే కాకుండా.. టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మంటను తగ్గించడం, గెండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం వంటి అనేక ప్రయోజనాలున్నాయి. ఇక చాలా మంది రోజులో ఎక్కువ సార్లు చాయ్ తాగేస్తుంటారు. ఏదైనా మితంగా ఉంటే బెటర్.. శ్రుతి మించితే ఆరోగ్యానికి హానికరం అంటున్నాయి అధ్యాయనాలు.. టీని ఎక్కువగా తాగితే చాలా ప్రమాదం అంటా. దీంతో ఎన్నో వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని వెల్లడైంది. మరి అవెంటో తెలుసుకుందామా.

టీలో ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. బ్లాక్ టీ, మిల్క్ టీ, గ్రీన్ టీలో సగటున 14-61 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. 96 మిల్లీ గ్రాముల కెఫిన్ కలిగిన ఒక కప్పుతో పోలిస్తే.. ఇది తక్కువే. రోజూ టీ తాగే సమయంలో అందులోని కెఫిన్ మన శరీరం సహజ సిర్కాడియన్ సమతుల్యత నుంచి మార్చేస్తుంది. మన సిర్కాడియన్ వ్యవస్థ 24 గంటల వ్యవధిలో మన శరీరం అనుసరించే దశలను సమతుల్యం చేస్తుంది. రోజు ఉదయం లేచినప్పటి నుంచి కాంతి, ఒత్తిడి, పని కెఫిన్ సమతుల్యత నుంచి మన శరీర సిర్కాడియన్ మార్చేస్తుంది. పగటి పూట తాగితే ఉత్సాహంగా ఉండడంతోపాటు.. రాత్రి బాగా నిద్రపోవడానికి సహయపడుతుంది. అదే మధ్యాహ్నం, సాయంత్రం సమయాలలో టీ ఎక్కవగా తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే గుండె సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, బరువు పెరగడం, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. అందుకే రాత్రి సమయంలో టీకి బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగవచ్చు.

వేడి టీ తాగడం వలన గొంతు క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం అధిక స్థాయిలో వేడి బ్లాక్ టీ తాగడం వలన గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా వెల్లడైంది. వేడి కాఫీ, టీ రెండూ కూడా గొంతుకు దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి. ఒక కప్పు టీ 150 డిగ్రీల ఫారెన్ హీట్‏లో ఉంటే.. అన్నవాహిక 127 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. అందుకే వేసవిలో టీ తాగకూడదు. రక్తహీనత, ఐరన్ లోపం ఉన్నవారు టీ తాగకూడదు. ఫుట్ సైన్స్, న్యూట్రిషన్ చేసిన అధ్యయనాలు శరీరంలో నలుపు , గ్రీన్ టీ ఇనుము 94% వరకు నియంత్రిస్తాయని తేలింది. టీలో లభించే టానిన్లు.. శరీరంలో ఐరన్ శోషణలో మార్పులకు కారణమవుతుంది. టానిన్లు టీ, వైన్, చాక్లెట్లలో లభించి సహజ మిశ్రమం. టీ ఎక్కువగా ఐరన్ తగ్గిస్తుంది. ఐరన్ లోపం ఉన్నప్పుడు అలసట, చంచలత, పొడి చర్మం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ మూత్ర విసర్జనగా పరిగణిస్తారు. గ్రీన్, బ్లాక్ టీ యొక్క మూత్రవిసర్జన లక్షణాలు శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, నిర్జలీకరణానికి దారితీస్తాయి. ఇది బద్ధకం, పెరిగిన లేదా సక్రమంగా లేని హృదయ స్పందన మరియు తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది.

Also Read: RS Praveen Kumar: వివాదాల్లోకి లాగితే అంచనాలు తలకిందులవుతాయ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్‌ కుమార్‌

Andhra Pradesh: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..