Jeff Bezos: జెఫ్ బెజోస్‌ను కిడ్నాప్ చేసిన ఏలియన్లు.. క్లారిటీ ఇచ్చిన అమెజాన్ సంస్థ
ఈ మధ్యే కక్ష్యలోకి సక్సెస్‌పుల్‌గా వెళ్లి వచ్చిన అమెజాన్ బాస్ జెఫ్‌బెజోన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది..
Jeff Bezos: ఈ మధ్యే కక్ష్యలోకి సక్సెస్‌పుల్‌గా వెళ్లి వచ్చిన అమెజాన్ బాస్ జెఫ్‌బెజోన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. భూమి నుండి 105 కిలోమీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీని ఆస్వాదించి, క్షేమంగా భూమికి తిరిగి వచ్చాడు. అది కూడా తన సొంత రాకెట్‌తో ఆకాశానికి ఎగిరిన బెజోస్ ప్రపంచంలో అంతరిక్షంలో ఇంత ఎత్తుకు వెళ్లిన తొలి బిలియనీర్‌గా రికార్డు సాధించాడు. అయితే కక్ష్యలోకి వెళ్లి వచ్చి సరిగ్గా వారం రోజులు కావొస్తున్న నేపథ్యంలో.. బెజోన్‌ను ఏలియన్స్ కిడ్నాప్ చేశాయంటూ వార్తలు వైరల్ అవుతుంది. అంతరిక్షంలోకి వెళ్లిన బెజోస్‌ను ఏలియన్లు కిడ్నాప్ చేశాయని ప్రచారం చేస్తున్నారు కొందరు థియరిస్ట్‌లు. ఆయన ప్లేస్‌లో ఏలియన్ డబుల్ బాడీని తిరిగి భూమ్మీదకు పంపించాయని, కావాలంటే ఆయన మెడ చూడడండి ఎలా సాగిలపడి ఏలియన్‌లా ఉందో అంటూ కొన్ని ఆధారాలను బయటపెట్టారు. అయితే ఈ వార్తలను అమెజాన్ సంస్థ ‘ఛీ’ కొట్టిపారేసింది. పదకొండు నిమిషాల గ్యాప్‌లో, అదీ తోడుగా ఇతర సభ్యులు ఉండగా… ఏలియన్స్ కిడ్నాప్ చేశారనే వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది.
ఇక జులై 20న వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు.పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి బ్లూ ఆరిజిన్ షెపర్డ్ రోదసిలోకి దూసుకెళ్లింది. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో నలుగురు సభ్యుల బృందం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లింది. 11 నిముషాలు అంటే సరిగ్గా 6.41 గంటలకు వ్యోమగాములు సమీపం లోని ఎడారిలో ల్యాండయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :