Prabhas – Nag Ashwin: ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ సినిమా కీలక అప్‌డేట్‌.. తొలిసారి పాన్‌ ఇండియా చిత్రంలో కామెడీ కింగ్‌..

Prabhas Nag Ashwin: బాహుబలి చిత్రంతో ఒక్కసారి నేషనల్‌ హీరోగా మారారు ప్రభాస్‌. దీంతో ప్రభాస్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రభాస్‌ నుంచి సినిమా వస్తుందంటే...

Prabhas - Nag Ashwin: ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ సినిమా కీలక అప్‌డేట్‌.. తొలిసారి పాన్‌ ఇండియా చిత్రంలో కామెడీ కింగ్‌..
Prabhas Nagashwin Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 26, 2021 | 1:21 PM

Prabhas – Nag Ashwin: బాహుబలి చిత్రంతో ఒక్కసారి నేషనల్‌ హీరోగా మారారు ప్రభాస్‌. దీంతో ప్రభాస్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రభాస్‌ నుంచి సినిమా వస్తుందంటే యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ అటువైపు చూసే పరిస్థితులు వస్తున్నాయి. డార్లింగ్‌ సినిమాకు కనీసంలో కనీసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారంటేనే ప్రభాస్‌ రేంజ్‌ ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మూవీ మేకర్స్‌ కూడా ప్రభాస్‌ రేంజ్‌కు తగ్గట్లుగానే సినిమాలను ప్లాన్‌ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన బడా స్టార్లు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్‌, నాగ అశ్విన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. టైమ్‌ మిషన్‌ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా అది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త హల్చల్‌ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ K అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బ్రహ్మీ ఒక కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్రకు బ్రహ్మానందం అయితేనే సరిపోతారని భావించిన నాగ్‌ అశ్విన్‌ ఆయనను అప్రోచ్‌ అయ్యారని, దానికి బ్రహ్మీ కూడా సానుకూలంగా స్పందించారని టాక్‌. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒక వేళ ఈ వార్తే కనుక నిజమైతే బ్రహ్మానందం నటిస్తోన్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ఇదే అవుతుంది. ఇదిలా ఉంటే ఒకప్పుడు ప్రతీ సినిమాలో కచ్చితంగా కనిపించే బ్రహ్మానందం కొన్ని రోజులుగా సినిమాలకూ దూరంగా ఉంటూ వస్తున్నారు. చివరిగా జాతి రత్నాలులో తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించారు బ్రహ్మీ. ఇక జాతి రత్నాలు చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Prabhas Bramhanandam

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ షురూ.. పోలీస్ గెటప్‌‌‌లో అదరగొడుతోన్న పవర్ స్టార్..

ఫిట్నెస్ కోసం పడరానిపాట్లు.. తలకిందులుగా యోగా చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Regina Cassandra: బాలీవుడ్ బంపర్ ఆఫర్ దక్కించుకున్న రెజీనా.. ఆ రీమేక్‌‌‌‌లో ఛాన్స్..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..