Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ షురూ.. పోలీస్ గెటప్‌‌‌లో అదరగొడుతోన్న పవర్ స్టార్..

ఆకలితో ఉన్న అభిమానులకు వకీల్ సాబ్ తో కడుపునిండేలా చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఎప్పుడెప్పుడు..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ షురూ.. పోలీస్ గెటప్‌‌‌లో అదరగొడుతోన్న పవర్ స్టార్..
Pawan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 26, 2021 | 1:54 PM

Pawan Kalyan : ఆకలితో ఉన్న అభిమానులకు వకీల్‌‌‌సాబ్‌‌‌‌తో కడుపునిండేలా చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఎప్పుడెప్పుడు పవన్‌‌‌‌ను వెండితెరపై చూద్దామా.. అంటూ వేయికళ్లతో ఎదురుచూశారు అభిమానులు. దాదాపు మూడేళ్ళ తర్వాత వకీల్‌‌సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ సంచలన విజయాన్ని అనుకున్నారు. ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్‌‌‌లోపెట్టారు పవన్. ఈక్రమంలోనే యంగ్ హీరో రానాతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు పవన్. మలయాళం లో సూపర్ హిట్ అయినా `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొన్నామధ్య మొదలయ్యింది. ఈ మేరకు చిన్న వీడియోను కూడా విడుదల చేసారు చిత్రయూనిట్.. అలా మొదలు పెట్టారో లేదో కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌‌‌‌కు ప్యాకప్ చెప్పేశారు.

ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టారు. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్‌‌‌‌ను తిరిగి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ స్పాట్‌‌‌‌లో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ గెటప్ లో బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయ్యపనం కోషియం” చిత్రంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పాత్ర గురించి, ఈ పాత్ర పేరు గురించి చాలా పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ పాత్ర పేరు రివీల్ చేసింది మూవీ యూనిట్. ఇక ఈ సినిమాలో పవన్‌ సరసన నిత్యా మీనన్‌, రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని టాక్‌. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు.

Power Star

Power Star

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఫిట్నెస్ కోసం పడరానిపాట్లు.. తలకిందులుగా యోగా చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Shyam Singha Roy: షూటింగ్‌‌‌‌కు గుమ్మడికాయ కొట్టేసిన శ్యామ్ సింగరాయ్ టీమ్.. త్వరలోనే..

Regina Cassandra: బాలీవుడ్ బంపర్ ఆఫర్ దక్కించుకున్న రెజీనా.. ఆ రీమేక్‌‌‌‌లో ఛాన్స్..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి