Regina Cassandra: బాలీవుడ్ బంపర్ ఆఫర్ దక్కించుకున్న రెజీనా.. ఆ రీమేక్‌‌‌‌లో ఛాన్స్..

అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాతర్వాత టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసిన సాలిడ్..

Regina Cassandra: బాలీవుడ్ బంపర్ ఆఫర్ దక్కించుకున్న రెజీనా.. ఆ రీమేక్‌‌‌‌లో ఛాన్స్..
Regina Cassandra
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 26, 2021 | 11:28 AM

Regina Cassandra: అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌‌‌లో వరుసగా సినిమాలు చేసినా.. సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. చాలాకాలం సక్సెస్ కోసం ఎదురుచూశాడు ఈ యంగ్ హీరో.. చివరకు రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టాడు. తమిళ్ సినిమాకు రీమేక్‌‌‌గా వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మంచి విజయన్ని అందుకుంది. ఇక ఈ కుర్రహీరో ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. తెలుగులో భారీ విజయాన్ని దక్కించుకున్న ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌‌‌గా నటించేది ఎవరన్నది నిన్నటివరకు సస్పెన్స్‌‌‌గా మారింది. మొదట శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ దాదాపు ఖరారైందని టాక్ నడిచింది.

అయితే కియారా డేట్స్ సమస్య తలెత్తడంతో ఆమె ప్లేస్‌‌‌‌ను రెజీనా కాసాండ్రా రీప్లేస్ చేసిందని తెలుస్తుంది. రెజీనా మొదట తెలుగు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళ్ లో ఈ అమ్మడికి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత  హిందీలో కూడా నటించింది రెజీనా. 2018లో హిందీలో ‘ఎక్ లడకీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో చేసినా రెజీనాకు ఆ తర్వాత అక్కడ అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఛత్రపతి రీమేక్‌‌‌‌తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది రెజీనా. ఇక ఛత్రపతి రీమేక్‌‌‌‌‌కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నారప్ప జోరు తగ్గేలోగానే మరో సినిమాతో రానున్న వెంకటేష్.. ఆ సినిమాను కూడా ఓటీటీలోనే..

Jayanthi Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటి జయంతి కన్నుమూత..

Alia Bhatt: ముంబైకి పయనమైన ముద్దుగుమ్మ.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆలియా..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?