పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా కేసుకు సంబంధించి సాక్షిగా మారిన ఓ నిందితుడు ..తాము నగ్న చిత్రాలు తీసినప్పటికీ కుంద్రా కంపెనీతో తమకెలాంటి సంబంధం లేదని తెలిపాడు. కుంద్రా సంస్థతో కలిసి పని చేయకపోయినా ఆ కోణంలో న్యూడ్ మూవీలు తీసినట్టు తన్వీర్ హష్మి అనే ఈ వ్యక్తి తెలిపాడు. ఈ కేసులో నలుగురు ఉద్యోగులు సాక్షులుగా మారారని, వారి సాక్ష్యం కీలకం కానుందని ముంబై పోలీసులు నిన్న తెలిపారు. తాను, మరికొందరు 20-25 నిముషాల నగ్న లఘు చిత్రాలు తీసినమాట నిజమేనని, కానీ వీటిని పోర్న్ చితాలని అనలేమన్నాడు. వీటిని సాఫ్ట్ పోర్న్ మూవీలనవచ్చు అని హష్మి పేర్కొన్నాడు. బహుశా తమ చిత్రాలను కుంద్రా వాడుకుని ఉండవచ్చు అని అభిప్రాయపడ్డాడు. తానేమీ నేరం చేయలేదని, నిజానికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తాను భాగమని ఆయన చెప్పాడు. ఈ కేసులో పోలీసులు మొదట తనను అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ బెయిల్ పై విడుదలైనట్టు తెలిపాడు.పోలీసులు ఇతడిని సుమారు మూడు గంటలపాటు విచారించారు.ఇతడు చెబుతున్నది నిజమేనా అని ఆరా తీస్తున్నారు.
విచారణకు మళ్ళీ హాజరు కావాలని వారు తనను కోరలేదని తన్వీర్ హష్మి చెప్పాడు. కోర్టులో కేసు వేస్తానని, అసలు పోర్న్ తో కూడిన ఎంతో కంటెంట్ ఇతర ప్లాట్ ఫామ్స్ లో కనిపిస్తున్నా ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదన్నాడు. ఇలా ఉండగా కుంద్రా సహచరులకు చెందిన 18 బ్యాంకు అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. రెండు బ్యాంకుల నుంచి సుమారు 2 కోట్ల 38 లక్షలను వారు స్స్వాధీనం చేసుకున్నారు. ఇక వియాన్ కంపెనీలో రహస్య లాకర్ లో కుంద్రా దాచిన డాక్యుమెంట్లను కూడా వారు పరిశీలిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Gold Bag: నిజాయితీకి మారుపేరు.. దొరికిన అర కేజీ బంగారం పోలీసులకు అప్పగించిన వ్యాపారి..
PPF Account: మీ PPF ఖాతా మూసివేయబడితే టెన్షన్ తీసుకోకండి.. తిరిగి ఇలా ప్రారంభించవచ్చు..