AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మార్చురీలో నుంచి గురక శబ్దం.. కంగుతిన్న డాక్టర్లు.. చెక్ చేయగా షాక్

అతడో ఖైదీ. అకస్మాత్తుగా అచేతన స్థితిలోకి వెళ్లడంతో జైలు సిబ్బంది.. డాక్టర్లను సంప్రదించారు. ముగ్గురు డాక్టర్లు వచ్చి అతడు చనిపోయాడని...

Viral News: మార్చురీలో నుంచి గురక శబ్దం.. కంగుతిన్న డాక్టర్లు.. చెక్ చేయగా షాక్
Dead Man Wakes Up
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2021 | 1:28 PM

Share

అతడో ఖైదీ. అకస్మాత్తుగా అచేతన స్థితిలోకి వెళ్లడంతో జైలు సిబ్బంది.. డాక్టర్లను సంప్రదించారు. ముగ్గురు డాక్టర్లు వచ్చి అతడు చనిపోయాడని కన్ఫాయ్ చేశారు. దీంతో డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం చేయడానికి సిద్ధం చేస్తుండగా.. ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో వైద్యుల మైండ్ బ్లాంక్ అయ్యింది.  మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన సైన్స్‌ అలర్ట్‌లో పబ్లిష్ అవ్వడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గొంజలో అనే ఖైదీ ఉన్నట్లుండి స్పృహ కోల్పోయాడు. అతడిని పరీక్షించిన ఇద్దరు డాక్టర్లు గొంజలో చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం జైలు ఫార్మాలిటీ ప్రకారం సిబ్బంది.. ఫోరెన్సిక్ వైద్యుడిని పిలిపించి పరీక్షలు చేయించారు. అతను కూడా గొంజలో మృతి చెందినట్లు స్పష్టం చేశాడు. దీంతో డెడ్‌బాడీని బ్యాగ్‌లో ఉంచి మార్చురీలో ఉంచారు. అటాప్సీ నిర్వహించడానికి మార్చురీలోకి వచ్చిన డాక్టర్ల అక్కడ వచ్చిన శబ్దం చూసి కంగుతిన్నారు. శవాలు మాత్రమే ఉండే ఆ గదిలో వారికి పెద్ద గురక శబ్దం వినిపించింది. భయంతో షాక్‌కు గురైన వైద్యులు.. ఆ తర్వాత తేరుకుని.. శబ్దం ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకునేందుకు వెతికారు.

గొంజలో మృతదేహం ఉన్న బ్యాగ్ లోపలి నుంచి శబ్దం వస్తోందని నిర్దారించుకున్నారు. చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించి.. మార్చురీలో పెట్టిన తర్వాత గొంజలో బాడీలో చలనం వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా గొంజలో బతికే ఉన్నట్లు తెలిసింది. గొంజలోకు ఫిట్స్‌ వచ్చి ఉంటుందని, కొన్ని అరుదైన సందర్భాలలో శరీరం ట్రాన్స్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయి స్పృహ కోల్పోతుందని నిపుణులైన డాక్టర్లు తెలిపారు.

Also Read:టిప్ ఇచ్చేందుకు డబ్బు లేదు.. కానీ ఆ కస్టమర్ డెలవరీ బాయ్‌ను నిరాశపరచలేదు..

 రన్నింగ్ ట్రైన్‌కు వేలాడుతూ కనిపించిన గొర్రె.. ఏం జరిగిందా అని ఆరా తీయగా షాక్

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి