Miracle Bore Water: ఆ బోరు వాటర్ తాగితే కీళ్ల నొప్పులు మాయం.. ఆ నీటి కోసం క్యూ కడుతున్న జనం..

ఆ బోరు వాటర్‌ తాగితే నొప్పులు మాయమవుతాయి. షుగర్‌, గ్యాస్‌ ట్రబుల్‌కు టానిక్‌లా పనిచేస్తాయి. వినడానికి వింతగా ఉన్నా.. విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు నుంచి కూడా ఆ నీటి కోసం వస్తున్నారు మరి.

Miracle Bore Water: ఆ బోరు వాటర్ తాగితే కీళ్ల నొప్పులు మాయం.. ఆ నీటి కోసం క్యూ కడుతున్న జనం..
Bore Is Water
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 26, 2021 | 7:39 AM

ఆ బోరు వాటర్‌ తాగితే నొప్పులు మాయమవుతాయి. షుగర్‌, గ్యాస్‌ ట్రబుల్‌కు టానిక్‌లా పనిచేస్తాయి. వినడానికి వింతగా ఉన్నా.. విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు నుంచి కూడా ఆ నీటి కోసం వస్తున్నారు మరి. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తీరువూరు ప్రధాన రహదారిపై తెల్లదేవరపల్లి ఓ చేతిపంపు ఉంది. స్థానికంగా ప్రజలు ఏళ్లతరబడి ఈ బోరు నీటినే తాగుతున్నారు. ఈ మండలం ప్రజలే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి వచ్చి నీటిని తీసుకెళ్తారు. అందుబాటులో వాటర్‌ ప్లాంటులు, ఇతర చేతి పంపులు, నల్లాలు ఎన్ని ఉన్నా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ బోరు నీళ్లు తీసుకెళ్లి తాగుతారు. ఈ బోరు వాటర్‌పై అంత నమ్మకం అక్కడి ప్రజలకు.

ఈ బోరు వాటర్‌ ఉదయాన్నే తాగితే, కీళ్ల నొప్పులు, గ్యాస్‌ ట్రబుల్, షుగర్‌ సమస్య ఉండదని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉండే వృద్ధులు ఈ బోరు నీటినే తాగుతారని చెబుతున్నారు. దశాబ్దాలుగా ఈ చేతిపంపు నీటినే తాగుతున్నామని, కేవలం తామే కాకుండా, చాట్రాయి మండలం, తిరువూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఈ నీటిని తీసుకెళ్లేందుకు వస్తారని అంటున్నారు.

ఒక్కసారి ఈ బోరు నీళ్లు తాగితే, ఇక వేరే వాటర్ తాగలేమని చెబుతున్నారు అక్కడి ప్రజలు. ఇక్కడి ప్రజలే కాదు, ఈ రహదారిపై ప్రయాణించే వారు ఆగి వాటర్ తీసుకెళ్తున్నారు. బస్సుల్లో, లారీల్లో వెళ్లేవారు ఆగి మరీ ఈ బోరు వాటర్‌ తీసుకెళ్తున్నారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా ఈ నీటిని తీసుకెళ్తున్నారంటే, ఆ వాటర్‌పై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

అక్కడి ప్రజలకు ఈ బోరు నీళ్లకు ఎంతలా అలవాటు పడ్డారంటే, ఎక్కడికైనా బంధువుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తే, ఇక్కడికొచ్చి అన్ని రోజులకు సరిపడా ఈ బోర్‌ వాటర్‌ తీసుకొని వెళ్తున్నారు. ఇక వేసవి వస్తే, ఈ బోరు దగ్గర పెద్ద క్యూ ఉంటుందని అంటున్నారు స్థానికులు. ఇంత మంచి నీరు తమ ప్రాంతంలో ఉండటం అదృష్టమని చెబుతున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Viral Video: చిరుతను మింగేందుకు ఎగబడి వచ్చిన కొండ చిలువ.. చివరికి షాకింగ్ సీన్