తాలిబన్ల పోరుతో భారత పర్యటనను వాయిదా వేసుకున్న ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ అహ్మద్ జాయ్..
తమ దేశంలో తాలిబన్లు జరుపుతున్న పోరు కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అహ్మద్ జాయ్ తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు.
తమ దేశంలో తాలిబన్లు జరుపుతున్న పోరు కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అహ్మద్ జాయ్ తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన ఇండియాలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే తోను, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోను, ఇతర అధికారులతో సమావేశం కావలసి ఉంది. ఈ నెల 27-30 తేదీల మధ్య ఆయన ఢిల్లీని విజిట్ చేయడమే కాక..పూణేలోని వివిధ సంస్థల్లో శిక్షణ పొందుతున్న ఆఫ్ఘన్ కేడెట్లను కూడా కలుసుకోవలసి ఉంది. పైగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఇదే సమయంలో ఇండియాను సందర్శిస్తున్నారు. ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ గా అహ్మద్ జాయ్ ని అక్కడి ప్రభుత్వం గత నెలలోనే నియమించింది. తమ దేశంలో తాలిబన్ల ఆక్రమణలు పెరుగుతున్న దృష్ట్యా.. అహ్మద్ జాయ్ ఇండియాకు ప్రస్తుతం వెళ్లడంలేదని ఆఫ్ఘన్ ఎంబసీ వెల్లడించింది. తాలిబన్లు ఆక్రమించుకుంటున్న జిల్లాలు, ప్రాంతాలను తిరిగి వశ పరచుకునేందుకు ఆఫ్ఘన్ దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయి.
అమెరికావైమానిక దళాలు తమకుమద్దతు నిస్తున్నా తమ శక్తికి మించి ప్రతిఘటిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన 7 వేలమందికి పైగా పాకిస్తానీయులు ఉన్నారు. అందువల్ల భద్రతా పరంగా చూసినా ఇది ఇండియాకు కొంతవరకు ఆందోళన కలిగించే విషయమే.. తాలిబన్లు ప్రయోగించిన రాకెట్లలో మూడు నిన్న అధ్యక్షుడు అష్రాఫ్ ఘని అధ్యక్ష భవనం ముందు పడినట్టు తెలుస్తోంది. అయితే ఎవరూ గాయపడలేదు. పరిస్థితి మరింత విషమించిన పక్షంలో ఆఫ్ఘన్ ప్రభుత్వం భారత సైన్యం సాయాన్ని కోరవచ్చు.. ఈ విషయమై ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి ఇదివరకే అధికారులతో సంప్రదించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Varalaxmi Sarathkumar: ఐష్ కూతురితో జయమ్మ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వరలక్ష్మీ ఫోటోలు..
Credit Cards: ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉండటం ప్రయోజనకరమే.. ఎలా అంటే..