Niharika Konidela: భర్త పుట్టిన రోజున వెరైటీగా విషెస్ చెప్పిన మెగా డాటర్.. నిక్ నేమ్ బయటపెట్టిన నిహారిక..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 26, 2021 | 8:58 PM

మెగా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు బుల్లితెరపై కూడా

Niharika  Konidela: భర్త పుట్టిన రోజున వెరైటీగా విషెస్ చెప్పిన మెగా డాటర్.. నిక్ నేమ్ బయటపెట్టిన నిహారిక..
Niharika

మెగా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు బుల్లితెరపై కూడా తన సత్తా నిరూపించుకున్న నిహారిక.. ఆ తర్వాత వెండితెరపై కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకుంది. అటు సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‍గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో వివాహాం జరిగిన తర్వాత నెట్టింట్లో మరింత యాక్టివ్ అయ్యింది మెగా డాటర్. ఆ మధ్య మాల్దీవులు, మొన్న పాండిచ్చెరి టూర్‌కు సంబంధించిన విశేషాలు నిహారిక షేర్ చేయగా అవి తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈరోజు (జూలై 26న) తన భర్త చైతన్య పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భర్తకు స్పెషల్ విషెస్ అందించింది.

హ్యపీ బర్త్ డే హస్బెండ్.. సినిమా సంగతుల్లో నీ వింత సెలక్షన్స్, నీ వంట ఎక్స్‌పరిమెంట్స్, నీ కాఫీ పిచ్చి, అర్దరాత్రి లేచి స్నాక్స్ తినడం, థీమ్ పార్టీలు చేయడంలో నీకున్న అంకిత భావం, నీ సిల్లీ రియాక్షన్స్, సైలెంట్‌గా బుద్దిమంతుడిలా ఉండటం, నీ ఓర్పు ఇలా ఓ భర్తకు కావాల్సిన అద్బుత లక్షణాలన్ని ఉన్నాయి. ఈ జీవితానికి నీ లాంటి మంచి వ్యక్తి దొరకడం కంటే ఇంకేం కావాలి. నువ్ నా మీద ప్రేమను కురిపిస్తున్న విధానానికి థ్యాంక్స్. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను.. చేచు అని భర్త నిక్ నేమ్ బయటపెట్టేసింది.

ట్వీట్..

Also Read: Nithiin-Shalini: పెళ్లిరోజున లవ్లీ పిక్ షేర్ చేసిన నితిన్.. భార్యకు థ్యాంక్స్ అంటూ ఆసక్తికర కామెంట్స్..

Andhra Pradesh: విజయవాడ – బెంగళూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

Shankar Mahadevan: ఈ అమ్మాయి టాలెంట్ అదుర్స్.. సింగర్ శంకర్ మహాదేవన్ మనసును హత్తుకున్న యంగ్ గర్ల్.. ఇంతకీ ఏం చేసిందంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu