Nithiin-Shalini: పెళ్లిరోజున లవ్లీ పిక్ షేర్ చేసిన నితిన్.. భార్యకు థ్యాంక్స్ అంటూ ఆసక్తికర కామెంట్స్..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. గతేడాది లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన అమ్మాయి షాలినిని ఎంతో ఘనంగా వివాహం

Nithiin-Shalini: పెళ్లిరోజున లవ్లీ పిక్ షేర్ చేసిన నితిన్.. భార్యకు థ్యాంక్స్ అంటూ ఆసక్తికర కామెంట్స్..
Nithiin
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 26, 2021 | 8:36 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. గతేడాది లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన అమ్మాయి షాలినిని ఎంతో ఘనంగా వివాహం చేసుకోవాలనుకన్నాడు. కానీ కరోనా కారణంగా సింపు‏ల్ గా 2020 జూలై 26న పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు కేవలం బంధుమిత్రులు, స్నేహితులు మాత్రమే హజరయ్యారు. నేటికి నితిన్, షాలిని జంట వివాహ జీవితంలో ఏడాది పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యతో కలిసి పెళ్లి రోజును జరుపుకున్నాడు నితిన్. తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‏స్టాలో షేర్ చేసుకున్నాడు.

నేను నా జీవితాన్ని చివరిదాకా కలిసి గడపాలనుకుంటున్న వ్యక్తికి హ్యాపీ యానివర్సరీ. నా జీవితాన్ని సులభతరం చేసినందుకు.. బెటర్ గా సంతోషంగా చేసినందుకు ధన్యవాదాలు” అని నితిన్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా.. తన భార్యకు ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూత్ స్టార్ అభిమానులు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో అనే బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ‘అంధాదున్’ అఫిషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి ‘మాస్ట్రో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతోపాటు.. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ మూవీ చేస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Shankar Mahadevan: ఈ అమ్మాయి టాలెంట్ అదుర్స్.. సింగర్ శంకర్ మహాదేవన్ మనసును హత్తుకున్న యంగ్ గర్ల్..

ఇంతకీ ఏం చేసిందంటే..

Goreti Venkanna: అంబేద్కర్ తర్వాత ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే.. దళిత బంధుపై ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు