Tirupati Fire Accident: తిరుపతిలో గ్యాస్ లీక్.. అపార్ట్‌మెంట్‌లో మంటలు.. భారీగా ఆస్తి నష్టం..!
Tirupati Fire Accident: తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలో ఆదివారం ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదశాత్తు గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో అపార్ట్‌మెంట్‌లో.
Tirupati Fire Accident: తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలో ఆదివారం ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదశాత్తు గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 లక్షల రూపాయల వస్తువులు కాలిపోయినట్లు అపార్ట్‌మెంట్ యజమాని పేర్కొన్నాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అగ్ని మాపక శకటాలతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అసిస్టెంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శ్యామ్ ప్రకాశ్ తెలిపారు. ప్రమాదం జరిగిన విషయమై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్లు భయాందోళనకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Fire broke out at an apartment due to gas leak in Tirupati town, this evening. Fire was doused. The owner of the apartment has claimed that items worth Rs 8 lakhs have been damaged. No casualty reported: Syam Prakash, Assistant Station Fire Officer(ASFO), Tirupati#AndhraPradesh pic.twitter.com/9sMRVbluIu
— ANI (@ANI) July 25, 2021