Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి అవసరానికి డబ్బులు చేతికందుతాయి.. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి

Horoscope Today: ప్రస్తుతమున్న కాలంలోనూ చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకునేందుకు ఎంతగానే ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను..

Horoscope Today: ఈ రాశివారికి అవసరానికి డబ్బులు చేతికందుతాయి.. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి
Follow us
Subhash Goud

|

Updated on: Jul 26, 2021 | 5:56 AM

Horoscope Today: ప్రస్తుతమున్న కాలంలోనూ చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకునేందుకు ఎంతగానే ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూలై 26) సోమవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి:

ఈ రాశివారికి ఈ రోజు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అధికారుల సాయంతో చేపట్టిన ఓ పనిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని పూజించడం మంచిది.

వృషభరాశి:

ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంటారు. ఒక శుభవార్త వింటారు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఎవ్వరిని అతిగా నమ్మకుండా ఉండటం మంచిది. సూర్యనారాయణను పూజించడం మంచిది.

మిథునరాశి:

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అవసరానికి ఆదుకునేవారుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. దుర్గాదేవిని పూజించడం మేలు జరుగుతుంది.

కర్కాటకరాశి:

ఈ రాశివారికి ఇతర రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సూచనలు, సలహాలు పాటించాలి. వ్యాపారాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. శివాస్తోత్తరాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది.

సింహరాశి:

చేపట్టే పనులను మంచి విజయాన్ని అందిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు వహించడం మంచిది. ఇతరు ప్రశంసలు అందుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కన్యరాశి:

ఈ రాశివారు గతంలో పూర్తి కాని ఓ పనిని పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ధైర్యంతో ఉందుకెళ్లడం మంచి జరుగుతుంది. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించదడం మంచిది.

తులరాశి:

ఈ రాశివారికి కృషికి తగిన ఫలితం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. నూతన కార్యాలు ఫలిస్తాయి. గణపతిని పూజించడం మేలు జరుగుతుంది.

వృశ్చికరాశి:

చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒక సంఘటన మనస్తాపం కలిగిస్తుంది. దైవారాధన వల్ల మంచి జరుగుతుంది.

ధనుస్సురాశి:

శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇష్టదైవాన్ని ఆరాధించడం మేలు చేస్తుంది.

మకరరాశి:

ఈ రాశివారికి బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవాన్ని ఆరాధించడం మంచి జరుగుతుంది.

కుంభరాశి:

ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగితే అన్ని మంచి ఫలితాలే అందుకుంటారు. వ్యాపారాలలో రాణిస్తారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్‌ చాలీసా జపించడం మంచిది.

మీనరాశి:

మనోబలంతో ముందుకెళ్లడం మంచిది. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈశ్వరున్ని ఆరాధిస్తే మంచి ఫలితాలుఉంటాయి.

వామ్మో... ఈ ఎద్దు ఏంటి ఇలా దాడి చేస్తోంది.. ?
వామ్మో... ఈ ఎద్దు ఏంటి ఇలా దాడి చేస్తోంది.. ?
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
ఆదాయపు పన్నులో మార్పులు.. రూ.12 లక్షల ఆదాయంపై జీరో ట్యాక్స్‌!
ఆదాయపు పన్నులో మార్పులు.. రూ.12 లక్షల ఆదాయంపై జీరో ట్యాక్స్‌!
ఏప్రిల్‌లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు
ఏప్రిల్‌లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశులకు లక్కే లక్కు
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో
చెర్రీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్‌.. ఇంకాస్త టైం పడుతుందన్న మోక్షు
చెర్రీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్‌.. ఇంకాస్త టైం పడుతుందన్న మోక్షు
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలెర్ట్..ఆ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే.!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలెర్ట్..ఆ సెట్టింగ్స్ మార్చుకోవాల్సిందే.!
చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో
చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో
నిత్యానంద బ్యాగ్రౌండ్ ఏంట..? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి
నిత్యానంద బ్యాగ్రౌండ్ ఏంట..? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి
అప్పుల ఊబిలో అనిల్ అంబానీ సామ్రాజ్యం..
అప్పుల ఊబిలో అనిల్ అంబానీ సామ్రాజ్యం..