AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్జున్ రెడ్డిలో ఈ నటి గుర్తుందా.? ఇప్పుడు ఆమె ఎలా ఉంది.? ఏం చేస్తుందంటే

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన ఈ హీరో.. అంతకు ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అర్జున్ రెడ్డి సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అర్జున్ రెడ్డిలో ఈ నటి గుర్తుందా.? ఇప్పుడు ఆమె ఎలా ఉంది.? ఏం చేస్తుందంటే
Arjun Reddy
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2025 | 2:32 PM

Share

విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసిన సినిమా ఏది అంటే చిన్న పిల్లాడు కూడా టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాతో అటు విజయ్, ఇటు సందీప్ ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అటు సందీప్ రెడ్డి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండే ఒక్కతే సక్సెస్ కాలేకపోయింది. కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు. ఈ సినిమాలో నటించిన చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి :అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్ 

అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఇంట్రోలొ ఓ నటి కనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ ను పరిచయం చేసే ఈ సన్నివేశంలో ఆమె కనిపిస్తుంది. ఆమె పేరు శ్రీసుధ. పలు సినిమాల్లో నటి శ్రీసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కాగా అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయ్యింది. ఆమెకు ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి :ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే

నటి శ్రీసుధ ఆ మధ్య వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో శ్యామ్‌ కె.నాయుడుపై శ్రీసుధ చీటింగ్ కేసు పెట్టారు.ఆతర్వాత ఆమె పై హత్యాప్రయత్నం చేశాడు అంటూ కూడా కేసు పెట్టారు శ్రీసుధ. ఇక ఇప్పుడు ఆమె వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారిపోయింది. అడవుల్లో జంతువులను ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. జంతువుల ఫోటోలతో పాటు అడపాదడపా తన ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రచ్చ మావ..! చేసింది చిన్న పాత్ర.. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!