AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే

ఇప్పుడేం కొత్త కాదు.. గతంలో ఇండస్ట్రీలో స్టార్స్‌గా రాణిస్తున్న స్టార్స్.. వారి కుటుంబంలోని వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేవాళ్లు. తమ బంధువుల పిల్లలను.. సొంత బ్రదర్స్ లేదా సిస్టర్స్‌ను ఎంకరేజ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా అక్కాచెల్లెళ్లు చాలామందే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించారు. ఆ లిస్ట్‌లో సీనియర్ హీరోయిన్ నగ్మ సిస్టర్స్ ఉన్నారు.

ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2025 | 10:34 AM

Share

టాలీవుడ్ లో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు హీరోలుగా హీరోయిన్స్ గా రాణించిన సందర్భాలు చాలా వున్నాయి. హీరోలు చాలా మంది ఉన్నారు కానీ హీరోయిన్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మలు గుర్తున్నారా.. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ భామలదే హవా.. ముఖ్యంగా నగ్మా. అందాలతారగా అప్పట్లో నగ్మా ఒక సన్సేషన్. ఆమె నటనకు.. అందంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నగ్మా. అప్పట్లో నగ్మా హీరోయిన్ అంటే చాలు ఆ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేది. ఇక నగ్మా సిస్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు జోతిక. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన జోతిక హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే నగ్మా మరో సిస్టర్ రోషిని కూడా హీరోయిన్ గా సినిమాలు చేశారు.

అయితే ఏ ముగ్గురు హీరోయిన్స్ తో నటించిన ఏకైక హీరో ఒకరు ఉన్నారు. ఆయన ఇప్పటికి హీరోగా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ భామల్లో జోతిక మినహా మిగిలిన వారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ఈ ముగ్గురు హీరోయిన్స్ తో ఆ స్టార్ హీరో నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరంటే..

ఇంకెవరు మన మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి పైన కనిపిస్తున్న ముగ్గురు సిస్టర్స్ తో సినిమాలు చేశారు. ఈ భామలు చిరు సరసన హీరోయిన్స్ గా నటించిన సినిమాలు ఏవంటే.. నగ్మా , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాల్లో ఘరానా మొగుడు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే జోతికతో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఠాగూర్.వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రోషినితో కలిసి చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?
కలర్ తోనే మతి పోగొట్టేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
కలర్ తోనే మతి పోగొట్టేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బంద్..! క్లారిటీ ఇదే
అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బంద్..! క్లారిటీ ఇదే