AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్

కాస్టింగ్ కౌచ్.. సినీరంగాన్ని పట్టిపీడిస్తోన్న సమస్య. ఇప్పటికే ఎంతో మంది తారుల ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను..కఠిన పరిస్థితుల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా సినిమాల్లో తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్న చాలా మంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నవారే. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, నటీమణులు తమకు ఎదురైన పరిస్థితుల గురించి సంచలన విషయాలు పంచుకున్నారు.

అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2025 | 10:08 AM

Share

ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. హీరోయిన్స్ కూడా దైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైనా చేదు అనుభవాలను. ఇండస్ట్రీలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు చాలా మంది నటీమణులు. యంగ్ హీరోయిన్స్ దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు తాము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఓ నిర్మాత అవమానంతో 6 నెలలు నరకం అనుభవించా అని చెప్పి ఎమోషనల్ అయ్యింది ఆ సీనియర్ నటి. ఇంతకూ ఆ అందాల భామ ఎవరు.? ఆమెను వేధించిన నిర్మాత ఎవరు.?

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో విద్యాబాలన్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. విద్యాబాలన్ నటించిన డర్టీ పిచ్చర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలోనూ నటించి మెప్పించింది విద్య.

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న విద్య తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ నిర్మాత తనను అవమానించాడని తెలిపింది విద్య బాలన్. తాజాగా విద్య మాట్లాడుతూ.. ఓ నిర్మాత తన దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ఒక సినీ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యకరంగా, ఛండాలంగా పిలిచాడు. ఆ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. ఆ అవమానంతో నేను దాదాపు ఆరు నెలలపాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఆ మాటలు నన్ను ఎంత బాధపెట్టాయంటే నేను ఆరు నెలల పాటు నరకం అనుభవించా.. ఆ మాటలకూ నేను మనిషిని కాలేకపోయా.. ఇలాంటి సంఘటనలు నా కెరీర్ లో చాలానే జరిగాయి. అదే టైం లో బాడీ షేమింగ్ కూడా చేశారు అని తెలిపింది విద్య బాలన్. అలాగే నాకు మలయాళంలో ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో సినిమా ఆగిపోయింది. దాంతో అందరూ నన్ను  దురదృష్టవంతురాలు అన్నారు. ఎదో కారణంతో సినిమా ఆగిపోతే దానికి నేను కారణం అన్నారు. ఇలాంటివి నా కెరీర్ లో చాలా జరిగాయి అని చెప్పుకొచ్చారు విద్య బాలన్.

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..