Mahesh Babu: సూపర్ స్టార్‌తో కలిసి ఫోటో దిగిన ఈ బుడతడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
ఇక పై ఫొటోలో కనిపిస్తున్న బుడతడు ఇప్పుడు క్రేజీ హీరో. ఇటీవలే మంది హిట్ కూడా అందుకున్నాడు. పై ఫొటోలో మహేష్ పక్కన చిన్న చిన్నోడు ఇప్పుడు కుర్ర భామల కలల రాకుమారుడు.
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా రాణించిన చాలా మంది ఇప్పుడు హీరోలుగా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే కొంతమందిని చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చూసి ఇప్పుడు పెద్దయిన తర్వాత చూస్తే అస్సలు గుర్తుపట్టలేం.. అంతలా మారిపోతుంటారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న బుడతడు ఇప్పుడు క్రేజీ హీరో. ఇటీవలే మంది హిట్ కూడా అందుకున్నాడు. పై ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ పక్కన చిన్న చిన్నోడు ఇప్పుడు కుర్ర భామల కలల రాకుమారుడు. చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ పక్కన ఉన్న ఈ బుడతడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే మీరూ కూడా షాక్ అయిపోతారు. ఇంతకు ఎవరో గుర్తుపట్టారా.. అయితే మీకు ఒక క్లూ ఈ బుడ్డోడు అచ్చం వాళ్ళ అమ్మాలనే ఉంటాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన కనిపిస్తున్న ఈ చిన్న బాబు ఎవరో కాదు.. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. ఈ యంగ్ బాయ్ ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. రోషన్ ముందు నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న రోషన్… రీసెంట్ గానే పెళ్లి సందడి అనే సినిమా చేశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యురాలు గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇక ఇప్పుడు రోషన్ తన సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోకుండా కథలో బలమున్న సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. త్వరలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయనున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుతో రోషన్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ పక్కన చిన్నబాబు ఇప్పుడు చాలా మారిపోయాడు.. కానీ మహేష్ బాబు మాత్రం ఏం మారలేదు.. అంతే అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.