Bigg Boss 6: బిగ్‌బాస్‌పై మరోసారి ధ్వజమెత్తిన నారాయణ.. షోను దానితో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ ప్రారంభం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు నారాయణ. ఈ షోలో అశ్లీలత బాగా పెరిగిందని, టాస్కుల పేరిట షోలో అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన పలు సందర్భాల్లో బిగ్‌బాస్‌పై విరుచుకు పడ్డారు. ముఖ్యంగా బిగ్‌బాస్‌ బ్రోతల్‌ హౌస్‌తో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

Bigg Boss 6: బిగ్‌బాస్‌పై మరోసారి ధ్వజమెత్తిన నారాయణ.. షోను దానితో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు
Cpi Narayana
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2022 | 12:47 PM

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌పై మరోసారి ధ్వజమెత్తారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ షో ఒక సాంఘిక దురాచారం లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ను పూర్తిగా రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని నారాయణ స్పష్టం చేశారు. ‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేశాం. కానీ పట్టించుకోలేదు. తెలంగాణ కోర్టులు ఈ కేసును స్వీకరించలేదు. అయితే ఏపీ హైకోర్టు ఈ విషయంపై స్పందించింది. ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడితో నా పోరాటం ఆగదు. బిగ్‌బాస్ షో ని రద్దు చేసేంతవరకు న్యాయ పోరాటం కొనసాగుతుంది’ అని నారాయణ స్పష్టం చేశారు. కాగా బిగ్‌బాస్‌ ప్రారంభం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు నారాయణ. ఈ షోలో అశ్లీలత బాగా పెరిగిందని, టాస్కుల పేరిట షోలో అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన పలు సందర్భాల్లో బిగ్‌బాస్‌పై విరుచుకు పడ్డారు. ముఖ్యంగా బిగ్‌బాస్‌ బ్రోతల్‌ హౌస్‌తో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

కాగా ఈ రియాలిటీషోను ఆపేయాలంటూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్‌ కూడా దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బిగ్ బాస్ నిర్వాహకులు, హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అక్కినేని నాగార్జునకు నోటీసులు కూడా జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. దీనిపై స్పందించిన బిగ్‌బాస్‌ నిర్వాహకులు కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని కోరారు. దీంతో విచారణను న్యాయస్థానం మరో నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది. గడిచిన వారం మెరీనా ఎలిమినేషన్‌ కావడంతో బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం 9 మంది మాత్రమే కంటెస్టెంట్స్ మిగిలారు.

ప్రతికారేచ్ఛతోనే ఐటీ దాడులు

కాగా మంత్రి మల్లారెడ్డిపై కొనసాగుతున్న ఐటీ దాడులపై నారాయణ స్పందించారు. ‘మల్లారెడ్డి కి రాజకీయాలలోకి రాక ముందే కాలేజీలు ఉన్నాయి. మల్లారెడ్డి కాలేజీ నిర్మాణం కోసం కొన్ని భూములు ఆక్రమించేశారు. తరువాత ప్రభుత్వ అనుమతులు తీసుకొని వుండొచ్చు. ఇప్పుడు 50 చోట్ల మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన స్థలాల్లో దాడులు చేస్తున్నారు. తెలంగాణ లో జరుగుతున్న ఐ.టి దాడులు ప్రభుత్యం పై జరుగుతున్న దాడులే. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ల కొనుగోళ్లలో బీజేపీ నాయకుల హస్తం బయట పెట్టింది కాబట్టే ఈ దాడులు జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్యం కౌంటర్ ఆటాక్ చేస్తుంది’ అని నారాయణ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..