AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్‌ ‘కాంతారా’.. ఎక్కడ చూడొచ్చునంటే.?

'కాంతారా' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈరోజు నుంచి ప్రసారం అవుతోంది. ఆ వివరాలు ఇదే..

Kantara OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్‌ 'కాంతారా'.. ఎక్కడ చూడొచ్చునంటే.?
Kantara Movie
Ravi Kiran
|

Updated on: Nov 24, 2022 | 6:46 AM

Share

రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘కాంతారా’. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. ఒక్క కన్నడంలోనే కాదు.. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్లా ప్రభంజనం సృష్టించి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టింది ఈ సినిమా. చూసిన వారు సైతం వన్స్ మోర్ అంటూ చాలా రోజుల పాటు అన్ని రకాల ప్రేక్షకులు థియేటర్లకు వరుసపెట్టి క్యూ కట్టారు. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించడం విశేషం. కర్ణాటకలో అయితే ఏకంగా కేజీఎఫ్-2 రికార్డును సైతం బ్రేక్ చేసింది.

ఇంతటి సూపర్ హిట్ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. ‘కాంతారా’ ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్ వీడింది. గురువారం(నవంబర్ 24) అర్ధరాత్రి 12 గంటల నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు థియేటర్లలోనే రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా.. ఓటీటీలో సైతం మొదటి రోజే మిలియన్లలో వ్యూస్ దక్కించుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా, రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగండుర్ నిర్మించారు. ఈ చిత్రం కన్నడంలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కాగా.. తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ చేశారు.

Kantara

Follow Us
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు APRS CAT 2026 నోటిఫికేషన్ విడుదల
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు APRS CAT 2026 నోటిఫికేషన్ విడుదల
మీరు బంగారం నాణ్యతను కేవలం ఒక యాప్‌తో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..
మీరు బంగారం నాణ్యతను కేవలం ఒక యాప్‌తో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..
రేపే చంద్ర గ్రహణం.. ఏ పదార్థాలపై దర్భ, గరక గడ్డి వేయాలో తెలుసా?
రేపే చంద్ర గ్రహణం.. ఏ పదార్థాలపై దర్భ, గరక గడ్డి వేయాలో తెలుసా?
తలరాత మారుతుంది..మనీ ప్లాంట్‌లో ఈ వస్తువుపెడితే, మీరే కోటీశ్వరులు
తలరాత మారుతుంది..మనీ ప్లాంట్‌లో ఈ వస్తువుపెడితే, మీరే కోటీశ్వరులు
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. వర్షం పడితే గెలుపెవరిది?
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్.. వర్షం పడితే గెలుపెవరిది?
ఆ విషయంలో హీరోలంతా ఒకే మాట మీదున్నారుగా
ఆ విషయంలో హీరోలంతా ఒకే మాట మీదున్నారుగా
వేసవిలో కారులో ఏ భాగాలు ఎక్కువగా దెబ్బతింటాయి..?
వేసవిలో కారులో ఏ భాగాలు ఎక్కువగా దెబ్బతింటాయి..?
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం!
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం!
ఇంగ్లాండ్‌తో సెమీస్ పోరు.. పాక్ రికార్డును మడతెట్టేసిన భారత్
ఇంగ్లాండ్‌తో సెమీస్ పోరు.. పాక్ రికార్డును మడతెట్టేసిన భారత్
మూత్రంలో రక్తం కనిపించడం మూత్రపిండాల క్యాన్సర్‌కు సంకేతమా..?
మూత్రంలో రక్తం కనిపించడం మూత్రపిండాల క్యాన్సర్‌కు సంకేతమా..?