Mani Sharma: నా లైఫ్‌లోనే చేయని మాస్ సాంగ్ సమంత కోసం చేశా.. కానీ తీసేసారు.. మణిశర్మ సంచలన కామెంట్స్

జాను సినిమా తర్వాత సామ్ చిన్న గ్యాప్ తీసుకొని చేసిన సినిమా యశోద. ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతుంది. గత కొద్దిరోజులుగా ఈ సమస్య వేధిస్తోన్నా.. పెదవిపై చెరగని చిరునవ్వుతో ప్రేక్షకులను అలరిస్తోంది.

Mani Sharma: నా లైఫ్‌లోనే చేయని మాస్ సాంగ్ సమంత కోసం చేశా.. కానీ తీసేసారు.. మణిశర్మ సంచలన కామెంట్స్
Manisharma
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2022 | 6:32 PM

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఆ యశోద. లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. జాను సినిమా తర్వాత సామ్ చిన్న గ్యాప్ తీసుకొని చేసిన సినిమా యశోద. ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతుంది. గత కొద్దిరోజులుగా ఈ సమస్య వేధిస్తోన్నా.. పెదవిపై చెరగని చిరునవ్వుతో ప్రేక్షకులను అలరిస్తోంది. యశోద సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదలైంది. అన్ని వర్గాల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంటూ భారీగా వసూళ్లు రాబడుతుంది. ఈ చిత్రంలో సామ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మణిశర్మ అందించిన సంగీతం యశోద సినిమాకు చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో తాను కంపోజ్ చేసిన సాంగ్ ను తొలగించారని అన్నారు మణిశర్మ. మణిశర్మ మాట్లాడుతూ.. యశోద సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుందట. ఆ పాటలాంటి దాన్ని తన లైఫ్ లోఎప్పుడు మణిశర్మ చేయలేదట.. అంత అద్భుతమైన పాటను కంపోజ్ చేశారట.

అసలు ఆ సాంగ్ సినిమాలో ఉండిఉంటే ప్రేక్షకులు పేపర్లు విసిరేసేవారట. పెద్ద హీరోలకు ఉండే పాట అది.. ఇద్దరు సిస్టర్స్ మధ్య ఉండే సాంగ్ అట. అంత మాస్ మసాలా సాంగ్ అంట అది. కానీ ఆ సాంగ్ ను ఫైనల్ కట్ తర్వాత సినిమాలో తీసేశారట. ఈ పాట కోసం చాలా డిస్కషన్ కూడా చేశాం అని అన్నారు మణిశర్మ. అయితే సామ్ అనారోగ్యం కారణంగానే ఆ మాస్ పాటను తీసేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు మణిశర్మ.

ఇవి కూడా చదవండి