Sai Pallavi: సంచలన నిర్ణయం తీసుకున్న సాయిపల్లవి.. సినిమాలకుఫిదా బ్యూటీ గుడ్ బై చెప్పనుందా..?

ప్రేమమ్ సినిమా ఆ విజయం సాధించడానికి సాయి పల్లవి నటనకూడా కారణమనే చెప్పాలి అంతలా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

Sai Pallavi: సంచలన నిర్ణయం తీసుకున్న సాయిపల్లవి.. సినిమాలకుఫిదా బ్యూటీ గుడ్ బై చెప్పనుందా..?
Sai Pallavi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2022 | 6:03 PM

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో ముందుగా చెప్పుకోవాల్సింది మలయాళ కుట్టి సాయి పల్లవి గురించే.. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. తొలి సినిమాతోనే నటనతో కట్టిపడేసింది. ప్రేమమ్ సినిమా ఆ విజయం సాధించడానికి సాయి పల్లవి నటనకూడా కారణమనే చెప్పాలి అంతలా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. భానుమతి సింగిల్ పీస్ అంటూ డైలాగ్ చెప్పిన ఈ భామ నిజంగానే సింగిల్ పీస్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడికి తెలుగులోనూ వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. మీడియం రేంజ్ హీరోలనుంచి స్టార్ హీరోల వరకు ఫస్ట్ ఛాన్స్ గా సాయి పల్లవి పేరే వినిపిస్తుంది.

తెలుగుతోపాటు తమిళ్, మలయాళ సినిమాల్లోనూ సాయి పల్లవి హీరోయిన్ గా నటించి మెప్పించింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ దూసుపోతోంది ఈ బ్యూటీ. అయితే గతకొంతకాలంగా సాయి పల్లవి నటిస్తున్న సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. సాయి పల్లవి లాస్ట్ గా నటించిన సినిమా గార్గి.

లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే సాయి పల్లవి మెడిసిన్ చదివిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సాయి పల్లవి కోయంబత్తూర్ లో సొంతంగా ఓ హాస్పటల్ నిర్మిస్తుందని తెలుస్తోంది. ఇక పై యాక్టింగ్ కు గుడ్ బై చెప్పి డాక్టర్ గా స్థిరపడాలని చూస్తుందట. ఈ హాస్పటల్ ను సాయి పల్లవితో పాటు ఆమె సిస్టర్ పూజా కలిసి నిర్వహించనున్నారట. అందుకనే ఈ బ్యూటీ సినిమాలకు బై బై చెప్పనున్నదని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?