80’s Reunion: రాధ అదిరిపోయే డ్యాన్స్.. పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరు

లేటు వయసులోనూ రాధలో అదే గ్రేస్. దీంతో మెగాస్టార్ ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను అభినందించారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

80's Reunion: రాధ అదిరిపోయే డ్యాన్స్.. పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ ఇచ్చిన మెగాస్టార్ చిరు
Actress Radha Dance
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 23, 2022 | 5:49 PM

ఇటీవల ఎయిటీస్ యాక్టర్స్ రీ యూనియన్ జరిగింది. ఈ వేడకల్లో వింటేజ్ స్టార్స్ సందడి చేశారు. ఈ వేడుకలు ముంబయిలోని జాకీ ష్రాఫ్‌ ఇంట్లో జరిగాయి. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కొన్ని వీడియోలు సైతం బయటకు వచ్చాయి. అందులో ఒకప్పటి అందాల తార రాధ వేసిన డ్యాన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి సర్‌ప్రైజ్ అయ్యారు.  ‘Sajna Hai Mujhe’ అనే హిందీ పాటకు రాధ డ్యాన్స్ చేయగా.. ఆమె గ్రేస్‌కు ఫిదా అయ్యి వెంటనే వెళ్లి హగ్ చేసుకున్నారు. మిగతా యాక్టర్స్ అంతా కూడా వావ్ అదుర్స్ అంటూ చప్పట్లు కొట్టారు.

ఇందుకు సంబంధించిన వీడియోను రాధ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘80 రీయూనియన్‌కు సంబంధించిన ఓ తియ్యటి జ్ఞాపకం. నాకు ఇష్టమైన పాటలకు డ్యాన్స్‌ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది.  మరో గొప్ప విషయం ఏమిటంటే నా ఫ్రెండ్స్ చిరంజీవి, వెంకీ, జాకీ ష్రాఫ్‌, పూనమ్‌ దిల్లాన్, స్వప్న, సరిత అక్కతో పాటు మిగిలినవారు చూపిన ప్రేమ’’ అని ఆమె రాసుకొచ్చారు.

ఈ ఏడాది 80స్ రీయూనియన్‌లో చిరంజీవి, వెంకీ, భానుచందర్‌, శరత్‌కుమార్‌, నరేశ్‌, అర్జున్‌,  కె. భాగ్యరాజ్, అనుపమ్‌ ఖేర్‌, అనిల్‌ కపూర్‌, రమ్యకృష్ణ, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, నదియా, విద్యాబాలన్‌, ఖుష్బూ, సుమలత,  టీనా అంబానీ,  మీనాక్షి శేషాద్రి  తదితరులు పాల్గొన్నారు. అప్పటి అనుభవాలు గుర్తు చేసుకుని మురిసిపోయారు. క్రేజీ డ్రస్ కోడ్‌లో ఈ ఈవెంట్‌లో పాల్గొన్న తారల ఫోటోలు ప్రజంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..