Kantara OTT: బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది.. కాంతార రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో

మొదట కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులోకి రిలీజ్ చేశారు. ఇక ఇక్కడి ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా.

Kantara OTT: బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది.. కాంతార రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో
Kantara
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2022 | 9:11 PM

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా కాంతార. సుమారు 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. మొదట కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులోకి రిలీజ్ చేశారు. ఇక ఇక్కడి ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన కాంతారా భాషలకు అతీతంగా ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. నటుడు రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా వ్యవహరించారు. ఇమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..ప్పటికే థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కాంతారా సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయనుంది.

నవంబరు 24న ‘కాంతార’ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. రేపు (24న ) కాంతారా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ లో సి హుసైన్ అప్పటికి మరోసారి ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో క్లైమాక్స్ లో హీరో రిషబ్ శెట్టి నటన గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా రికార్డులను కాంతార సినిమా బ్రేక్ చేసింది. ఐఏండిబి భారతదేశంలోని ప్రస్తుత టాప్ 250 చిత్రాల జాబితాలో  కాంతార మొదటి స్థానంలో నిలిచింది. కన్నడలో రిలీజ్ తరువాత దాదాపు 15 రోజులకు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల తన సత్తాను చాటుకుంది.కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..